ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడాకారులకు అండగా ఉంటాం

ABN, First Publish Date - 2020-09-30T09:34:08+05:30

ప్రభుత్వం తరఫున క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ భరోసా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రభుత్వం తరఫున క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ భరోసా ఇచ్చారు. బాక్సింగ్‌, అథ్లెటిక్స్‌లో సత్తా చాటుతున్న నలుగురు రాష్ట్ర క్రీడాకారులకు మంగళవారం రవీంద్రభారతిలో మంత్రి చేతుల మీదుగా ఎలక్ర్టిక్‌ స్కూటీల బహుకరణ కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, అథ్లెట్లు జి.దీప్తి, జి.మహేశ్వరి, ఎ.నందినికి స్కూటీలతో పాటు ఒక్కొక్కరికి రూ. 10 వేలు నగదు బహుమతిని ఎంఎల్‌ఆర్‌ మోటార్స్‌ డైరెక్టర్‌ చాముండేశ్వర్‌నాథ్‌ అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రతిభ గల యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, సాయ్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌, మాజీ అథ్లెట్‌ శోభ తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2020-09-30T09:34:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising