ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘టైసన్‌ ను ఓడిస్తే గేలి చేస్తారు’

ABN, First Publish Date - 2020-06-01T09:42:44+05:30

దిగ్గజ బాక్సర్‌ మైక్‌ టైసన్‌తో తలప డాలనుకోవడం లేదని బ్రిటన్‌ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ స్టార్‌ ఆంథోనీ జాషువా స్పష్టం చేశాడు. అతడంటే తనకు అపార గౌరవమని తెలిపాడు. ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడేందుకు తిరిగి రింగ్‌లోకి రావాలనుకుంటున్నట్టు టైసన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌: దిగ్గజ బాక్సర్‌ మైక్‌ టైసన్‌తో తలప డాలనుకోవడం లేదని బ్రిటన్‌ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ స్టార్‌ ఆంథోనీ జాషువా స్పష్టం చేశాడు. అతడంటే తనకు అపార గౌరవమని తెలిపాడు. ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడేందుకు తిరిగి రింగ్‌లోకి రావాలనుకుంటున్నట్టు టైసన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ‘అతడిపై నాకు చాలా గౌరవం ఉంది. ఒకవేళ అతడితో పోటీపడి గెలిచినా ప్రశంసలేమో కానీ అంతా నన్ను గేలి చేయడం ఖాయం. టైసన్‌ ఓ దిగ్గజం. ఆధునిక యుగంలో అతడే అత్యుత్తమ బాక్సర్‌. చిన్నప్పటి నుంచీ నాకు ప్రేరణగా నిలిచాడు’ అని నాలుగు హెవీవెయిట్‌ టైటిళ్లు సాధించిన జాషువా తేల్చాడు.

Updated Date - 2020-06-01T09:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising