ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విరాట్‌పై మా వ్యూహం అదే..

ABN, First Publish Date - 2020-04-10T09:36:33+05:30

ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ల కోసం విరాట్‌ కోహ్లీని కవ్వించకుండా మా వాళ్లు నోటికి తాళాలేసుకున్నారని విమర్శించిన మైకేల్‌ క్లార్క్‌కు ఆస్ట్రేలియా టెస్ట్‌ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్లార్క్‌ విమర్శలకు ఆసీస్‌ కెప్టెన్‌ పెయిన్‌ కౌంటర్‌

హోబర్ట్‌: ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ల కోసం విరాట్‌ కోహ్లీని కవ్వించకుండా మా వాళ్లు నోటికి తాళాలేసుకున్నారని విమర్శించిన మైకేల్‌ క్లార్క్‌కు ఆస్ట్రేలియా టెస్ట్‌ కెప్టెన్‌ టిమ్‌ పెయిన్‌ కౌంటర్‌ ఇచ్చాడు. టీమిండియా ఆసీస్‌ టూర్‌లో కోహ్లీని రెచ్చగొట్టకూడదనే వ్యూహంలో భాగంగానే ఆ విధంగా వ్యవహరించినట్టు తెలిపాడు. ‘కోహ్లీ పట్ల ఎవరూ మెతక ధోరణి కనబరిచినట్టు నాకు అనిపించలేదు. ఉద్దేశపూర్వకంగా అతడిని అవుట్‌ చేయకుండా ఉండాలనే ప్రయత్నమూ చేయలేదు. విరాట్‌ను కవ్విస్తే అతడు మరింతగా రెచ్చిపోయి భారీ స్కోరు సాధిస్తాడమోననే ఉద్దేశంతో అలా వ్యవహరించామ’ని చెప్పాడు. 2018-19 ఆస్ట్రేలియా టూర్‌లో భారత్‌ 2-1తో టెస్ట్‌ సిరీ్‌స నెగ్గి చరిత్ర సృష్టించింది. అయితే, ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌లు దక్కవనే భయంతోనే ఆ సిరీ్‌సలో ఆసీస్‌ ఆటగాళ్లు దూకుడుగా వ్యవహరించలేదని క్లార్క్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-04-10T09:36:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising