ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్టిన్ గుప్టిల్ హాఫ్ సెంచరీ.. అరుదైన రికార్డు

ABN, First Publish Date - 2020-02-08T14:36:20+05:30

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ఈడెన్ పార్క్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆక్లాండ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ఈడెన్ పార్క్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యా‌చ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. భారత బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ.. తొలి వికెట్‌కి 93 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ అర్థ శతకంతో రాణించాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 2  సిక్సులతో అతను 51 పరుగులు చేశాడు. 


ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును గుప్టిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. స్వదేశంలో 92 ఇన్నింగ్స్ ఆడిన గుప్టిల్ 4001 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో 96 ఇన్నింగ్స్‌లో 3896 పరుగులతో రాస్ టేలర్ నిలిచారు. గుప్టిల్ వీరోచిత ఇన్నింగ్స్‌తో 21 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 1 వికెట్ నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజ్‌లో గుప్టిల్(60), బ్లండెల్(12) ఉన్నారు.

Updated Date - 2020-02-08T14:36:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising