ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీ బాధలో ఉన్నాడు

ABN, First Publish Date - 2020-06-16T10:05:46+05:30

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుశాంత్‌ ఆత్మహత్యపై మహీ మేనేజర్‌ పాండే

రాంచీ: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, సుశాంత్‌ మరణ వార్త తెలుసుకొని పలువురు క్రికెటర్లతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా స్పందించగా.. ధోనీ మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు. దీనిపై అతడి మేనేజర్‌ అరుణ్‌ పాండే వివరణ ఇచ్చాడు. ‘సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త ధోనీని తీవ్రంగా కలిచివేసింది. అతడు బాధలో ఉన్నాడు. ఈ విషయాన్ని మేం జీర్ణించుకోలేకపోతున్నాం. మహీ బయోపిక్‌ కోసం మాజీ కీపర్‌ కిరణ్‌ మోరె శిక్షణలో సుశాంత్‌ చాలా కష్టపడ్డాడు. అతడి అంకితభావాన్ని చూసి ధోనీ ఆశ్చర్యపోయేవాడు. అలాంటి సుశాంత్‌ మన మధ్య లేడనే వార్త ను నమ్మలేకపోతున్నాం’ అని అరుణ్‌ విచారం వ్యక్తం చేశాడు.

Updated Date - 2020-06-16T10:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising