ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవకాశం వస్తే.. అమెరికా తరఫున క్రికెట్ ఆడుతా: లైమ్ ప్లంకెట్

ABN, First Publish Date - 2020-06-02T23:01:41+05:30

తనకి అవకాశం వస్తే.. అమెరికా తరఫున కూడా క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఇంగ్లండ్ పేస్ బౌలర్ లైమ్ ప్లంకెట్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: తనకి అవకాశం వస్తే.. అమెరికా తరఫున కూడా క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఇంగ్లండ్ పేస్ బౌలర్ లైమ్ ప్లంకెట్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత అతనికి ఇంగ్లండ్ జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల వెస్టిండీస్ సిరీస్‌కి ముందు జరిగే ప్రాక్టీస్ కోసం ప్రకటించిన 55 మంది సభ్యులలో కూడా అతని పేరు లేదు. అయితే ప్లంకెట్ భార్య అమెరికన్ కావడంతో.. అతను అక్కడే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లండ్‌లో అవకాశాలు మెరుగుకాకుంటే.. తన అంతర్జాతీయ గుర్తింపును మార్చుకొనే ప్రయత్నంలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. 


దీనిపై ప్లంకెట్ తాజాగా స్పందించాడు. ‘‘అక్కడి క్రికెట్‌లో కూడా పాల్గొనడం సరదాగా ఉంటుంది. నా పిల్లలకు అమెరికా పౌరసత్వం రావొచ్చు. నేను ఇంగ్లండ్, అమెరికా రెండు దేశాల తరఫున ఆడానని చెప్పడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. నేను అక్కడికి వెళ్లి నాకు అమెరికా పౌరసత్వమో లేకా.. గ్రీన్ కార్డ్ వస్తే.. వాళ్లకి కచ్చితంగా సహాయం చేస్తాను. ఆదీ ఒక మాజీ ఇంగ్లండ్ ఆటగాడిగా చేయడం బాగుంటుంది’’ అని అతను పేర్కొన్నాడు. 

Updated Date - 2020-06-02T23:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising