ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రికెట్‌కు ఓఝా గుడ్‌బై

ABN, First Publish Date - 2020-02-22T10:31:14+05:30

హైదరాబాద్‌కు చెందిన లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓఝా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ, జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ట్విటర్‌ ద్వారా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: హైదరాబాద్‌కు చెందిన లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓఝా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ, జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ట్విటర్‌ ద్వారా శుక్రవారం వెల్లడించాడు. 2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఓఝా..2013లో ముంబైలో చివరి టెస్ట్‌ ఆడాడు. సచిన్‌ ఆఖరి టెస్ట్‌ కూడా అదే కావడం గమనార్హం. అయితే దేశవాళీల్లో మాత్రం గతేడాది వరకు కొనసాగాడు. 16 ఏళ్ల ప్రొఫెషనల్‌ కెరీర్‌లో మొత్తం 24 టెస్ట్‌లు ఆడిన 33 ఏళ్ల ప్రజ్ఞాన్‌ 113 వికెట్లు పడగొట్టాడు. 18 వన్డేల్లో 21, ఆరు టీ20ల్లో 10 వికెట్లు సాధించాడు. రంజీల్లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ‘జీవితంలో తదుపరి దశకు వేళైంది. నాకు మద్దతుగా నిలిచి, ప్రేమాభిమానులు పంచిన అందరికీ కృతజ్ఞతలు’ అని ఓఝా ట్వీట్‌ చేశాడు. ప్రజ్ఞాన్‌ను టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అభినందిస్తూ ‘ముంబై ఇండియన్స్‌, భారత జట్టు సహచరుడిగా నీతో ఎన్నో మధురానుభూతులు పంచుకున్నా. మన స్నేహం క్రికెట్‌ మైదానానికి మించినది’ అని ట్వీట్‌ చేశాడు. 


Updated Date - 2020-02-22T10:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising