ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క కరోనా కేసు నమోదైనా ఐపీఎల్ కథ ముగిసినట్లే: నెస్ వాడియా

ABN, First Publish Date - 2020-08-07T23:11:09+05:30

ఐపీఎల్-2020 సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. భారీ కట్టుదిట్టాల మధ్య బీసీసీఐ ఈ టోర్నీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐపీఎల్-2020 సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. భారీ కట్టుదిట్టాల మధ్య బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహించనుంది. ఇందులో పాల్గొనేందుకు ఇతర క్రికెటర్లందరూ యూఏఈకి చేరనున్నారు. అయితే కరోనా సమయంలో ఈ టోర్నీ జరగడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కింగ్స్ లెవెన్ పంజాబ్ సహయజమాని నెస్ వాడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల సంరక్షణే ప్రధానమని, జట్టు యాజమాన్యం దానిపైనే దృష్టి సారించిందని నెస్ వాడియా తెలిపారు. ‘ఐపీఎల్ నిర్వహణపై ఎన్నో వదంతులు వినిపిస్తున్నాయి. కాని ఇప్పటికైతే ఐపీఎల్ జరుగుతున్న విషయం మాత్రమే యాజమాన్యాలకు తెలుసు. దీంతో ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు, సిబ్బంది భద్రతలకు సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకుంటుంన్నాం. వారి ఆరోగ్యాన్ని సంరక్షించడానికే తొలి ప్రాధాన్నయం ఇచ్చాం. అయితే ఒక్క కరోనా కేసు నమోదయినా ఐపీఎల్ కథ ముగిసినట్లే. ఇప్పటి వరకు పడిన కష్టమంతా దేనికీ పనికిరాకుండా పోతుంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నామ’ని నెస్ వాడియా పేర్కొన్నారు.

Updated Date - 2020-08-07T23:11:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising