ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరుపై పంజాబ్ అద్భుతమైన విజయం

ABN, First Publish Date - 2020-09-25T04:47:00+05:30

ఐపీఎల్ 2020లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 97 పరుగుల భారీ తేడాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: ఐపీఎల్ 2020లో భాగంగా జరిగిన ఆరో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 97 పరుగుల భారీ తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం సాధించి జెండా పాతింది. మొదటి మ్యాచ్‌లో ఎదురైన పరాభవంతో పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌ను కసిగా ఆడింది. పంజాబ్ కెప్టెన్ లోకేష్ రాహుల్ బ్యాట్‌తో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 62 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత రాహుల్ మరింత చెలరేగాడు. మ్యాచ్ ముగిసే సమయానికి 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌‌లతో 132 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలిచాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి బెంగళూరుకు 207 పరుగుల టార్గెట్‌ను ఇచ్చింది.


ఇక బెంగళూరు నుంచి బ్యాటింగ్‌కు దిగిన ఒక్క బ్యాట్స్‌మన్ కూడా ఈ మ్యాచ్‌లో ఏ మాత్రం ఆకట్టుకోలేదనే చెప్పాలి. బెంగళూరు నుంచి బ్యాటింగ్‌కు దిగిన బ్యాట్స్‌మెన్‌ను పంజాబ్ బౌలర్లు వెంట వెంటనే పెవిలియన్‌కు పంపారు. బెంగళూరు జట్టు నుంచి ఒక్క ఆటగాడు కూడా ఈ మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేయలేకపోయారంటే పంజాబ్ బౌలర్లు ఏ విధంగా చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా బెంగళూరు జట్టు 17 ఓవర్లలో 109 పరుగులు చేసి అన్ని వికెట్లను కోల్పోయింది. 97 పరుగుల భారీ తేడాతో పంజాబ్‌పై పరాజయం చెందింది. 

Updated Date - 2020-09-25T04:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising