ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మాస్టర్‌’ను దాటేశాడు..

ABN, First Publish Date - 2020-12-03T09:40:57+05:30

విరాట్‌ కోహ్లీ మరో మైలురాయి చేరుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 251వ వన్డే ఆడిన విరాట్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విరాట్‌ కోహ్లీ మరో మైలురాయి చేరుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 251వ వన్డే ఆడిన విరాట్‌.. 242 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను అందుకున్నాడు. దీంతో వేగంగా 12వేల రన్స్‌ జాబితాలో ఇప్పటిదాకా సచిన్‌ టెండూల్కర్‌ పేరిటనున్న రికార్డు బద్దలైంది. సచిన్‌ 300 (309 మ్యాచుల్లో) ఇన్నింగ్స్‌లో ఆ రికార్డు చేరుకున్నాడు. వన్డేల్లో వేగంగా 8వేలు, 9వేలు, 10 వేలు, 11వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులన్నీ కూడా కోహ్లీ పేరిటే ఉన్నాయి.


విరాట్‌... ఒక్క సెంచరీ లేకుండానే..

అత్యంత వేగంగా 12వేల పరుగుల మైలురాయి అందుకున్న విరాట్‌ కోహ్లీ.. ఇదే మ్యాచ్‌తో పేలవమైన రికార్డునూ మూటగట్టుకున్నాడు. వన్డేల్లో విరాట్‌ ఈ సంవత్సరం ఒక్క శతకం కూడా కొట్టలేకపోయాడు. దీంతో ఓ ఏడాదిని వన్డే సెంచరీ లేకుండా ముగించడం 11 ఏళ్ల తర్వాత అతనికిదే తొలిసారి. 2008లో వన్డే అరంగేట్రం చేసిన విరాట్‌.. 2009 నుంచి ప్రతి ఏటా కనీసం ఒక సెంచరీ అయినా బాదాడు. 2017, 2018లో ఆరేసి శతకాలు సాధించాడు. కానీ.. ఈ ఏడాది మాత్రం మూడంకెల స్కోరు చేయలేకపోయాడు.


మళ్లీ.. హాజెల్‌వుడ్‌కే

విరాట్‌ వరుసగా నాలుగో వన్డేలోనూ ఒకే బౌలర్‌కు వికెట్‌ సమర్పించుకున్నాడు. ఈ అరుదైన రికార్డును ఆసీస్‌ బౌలర్‌ హాజెల్‌వుడ్‌ దక్కించుకున్నాడు. ఈ సిరీ్‌సలో వరుసగా మూడు వన్డేల్లోనూ విరాట్‌ను అవుట్‌ చేసిన హాజెల్‌వుడ్‌.. అంతకుముందు బెంగళూరులో జరిగిన చివరి వన్డేలో కోహ్లీ వికెట్‌ను పడగొట్టాడు.



Updated Date - 2020-12-03T09:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising