దాతృత్వం చాటుకున్న కేఎల్ రాహుల్
ABN, First Publish Date - 2020-08-22T20:14:58+05:30
కరోనా మహమ్మారి కల్లోలం రేపుతున్న వేళ టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ దాతృత్వాన్ని..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కల్లోలం రేపుతున్న వేళ టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ దాతృత్వాన్ని చాటుకున్నాడు. బెంగళూరు విమానాశ్రయం వద్ద విధులు నిర్వహిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు విరాళంగా అందించాడు. కొవిడ్-19 నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది శ్రమకోర్చి పనిచేస్తున్నారని ఈ సందర్భంగా రాహుల్ కొనియాడాడు. ‘‘మన భద్రత కోసం సీఐఎస్ఎఫ్ సిబ్బంది పగలనక రాత్రనక పనిచేస్తున్నారు. మనం హాయిగా జీవించేందుకు వారు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇది నా ఒక్కడి బాధ్యత మాత్రమే కాదు. వారు సౌకర్యంగా, సురక్షితంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉంది. ఇది నా వంతుగా నేను చేస్తున్న ఓ చిన్న ప్రయత్నం మాత్రమే...’’ అని రాహుల్ పేర్కొన్నాడు. యూఏఈ వేదికగా త్వరలో జరిగే ఐపీఎల్ టోర్నమెంటులో కింగ్స్ లెవన్ పంజాబ్‌కు రాహుల్ సారథ్యం వహించనున్నాడు.
Updated Date - 2020-08-22T20:14:58+05:30 IST