ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వార్టర్స్‌లో జొకో, క్విటోవా

ABN, First Publish Date - 2020-10-06T09:03:30+05:30

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌, చెక్‌ భామ పెట్రా క్విటోవా క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిట్సిపాస్‌, రుబలేవ్‌ కూడా

ఫ్రెంచ్‌ ఓపెన్‌ 


పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌, చెక్‌ భామ పెట్రా క్విటోవా క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. 5వ సీడ్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌, రుబలేవ్‌, లారా సిగ్మండ్‌ కూడా రౌండ్‌-8కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌ మ్యాచ్‌లో ఏడో సీడ్‌ క్విటోవా 6-2, 6-4తో జాంగ్‌ షుయ్‌ (చైనా)పై వరుస సెట్లలో గెలిచింది. క్వార్టర్స్‌లో సిగ్మండ్‌తో క్విటోవా తలపడనుంది. క్విటోవా ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు చేరింది. 2012లో క్విటోవా సెమీ్‌సలో ఓటమిపాలైంది. మరో మ్యాచ్‌లో సిగ్మండ్‌ (జర్మనీ) 7-5, 6-2తో పౌలా బడోసా (స్పెయిన్‌)పై విజయం సాధించింది. 


జొకో అలవోకగా..:


సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌ జోరు కొనసాగిస్తున్నాడు. ప్రీ క్వార్టర్స్‌లో జొకోవిచ్‌ 6-4, 6-3, 6-3తో కరేన్‌ కచనోవ్‌ (రష్యా)ను ఓడించాడు. తొలి సెట్‌లో ఇద్దరూ సర్వీసులను నిలబెట్టుకోవడంతో 3-3తో సమమైంది. ఎనిమిదో గేమ్‌లో కచనోవ్‌ సర్వీ్‌సను బ్రేక్‌ చేసి 5-3తో జొకో ముందంజ వేశాడు. అదే ఊపులో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్‌లో నొవాక్‌ 6-3తో సునాయాసంగా నెగ్గాడు. కానీ, మూడో సెట్‌ నాలుగో గేమ్‌లో జొకో సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన కచనోవ్‌ 2-2తో సమం చేశాడు. అయితే, ఏడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకో 4-3తో ముందంజ వేశాడు. అదే ఊపులో 6-3తో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. గ్రీస్‌ ఆటగాడు సిట్సిపాస్‌ 6-3, 7-6(9), 6-2తో గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా)పై గెలిచాడు. రష్యా ఆటగాడు ఆండ్రీ రుబలేవ్‌ 6-7(4), 7-5, 6-4, 7-6(3)తో మార్టన్‌ ఫస్కోవిచ్‌ (హంగేరి)పై నెగ్గి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్స్‌ చేరాడు. క్వార్టర్స్‌లో సిట్సిపా్‌సతో రుబలేవ్‌ తలపడనున్నాడు. 

Updated Date - 2020-10-06T09:03:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising