ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాచ్‌కు ముందు ఢిల్లీకి ఎదురుదెబ్బ.. ఇషాంత్‌కు గాయం

ABN, First Publish Date - 2020-09-20T21:17:57+05:30

తొలి మ్యాచ్‌కు ముందు ఢిల్లీ కేపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బౌలర్ ఇషాంత్‌శర్మ గాయపడ్డాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా నిన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: తొలి మ్యాచ్‌కు ముందు ఢిల్లీ కేపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బౌలర్ ఇషాంత్‌శర్మ గాయపడ్డాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా నిన్న గాయపడినట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. నేటి మ్యాచ్‌లో ఇషాంత్ ఆడేది, లేనిది మ్యాచ్‌కు ముందు తెలియనుంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి ఇషాంత్ ఫిట్‌గా ఉంటేనే బరిలోకి దింపాలని, లేదంటే పక్కన పెట్టాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మెడికల్ టీం పరీక్షించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్టు ఢిల్లీ సపోర్ట్ స్టాప్ తెలిపింది. 


ఈ ఏడాది జనవరిలో చీలమండ గాయంతో జట్టుకు దూరమైన 32 ఏళ్ల ఇషాంత్ శర్మ తిరిగి ఫిబ్రవరిలో జట్టులో చోటు సంపాదించాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా జట్టులోకి వచ్చినప్పటికీ మళ్లీ అదే గాయంతో జట్టుకు మరోమారు దూరమయ్యాడు. 2019లో ఢిల్లీ కేపిటల్స్‌ ఇషాంత్‌ను కొనుగోలు చేసింది. ఈ ఏడాది కూడా అతడిని రిటైన్ చేసుకుంది. గత సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ 7.58 ఎకానమీతో 13 వికెట్లు తీసుకున్నాడు.  

Updated Date - 2020-09-20T21:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising