ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్థాన్‌పై హ్యాట్రిక్‌కి ముందు మా నాన్నతో యూసుఫ్ ఏమన్నాడంటే: ఇర్ఫాన్

ABN, First Publish Date - 2020-06-02T01:25:01+05:30

2003లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన టీం ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్.. 2006లో కరాచీ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో హ్యాట్రిక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2003లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన టీం ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్.. 2006లో కరాచీ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి.. సంచలన సృష్టించిన తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు డ్రా కావడంతో.. సిరీస్ దక్కించుకోవాలనే తపనతో ఇరు జట్లు మూడో టెస్ట్‌లోకి అడుగుపెట్టాయి. అయితే మొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించి.. పాకిస్థాన్ టాప్ ఆర్డర్‌ని తీవ్రస్థాయిలో దెబ్బకొట్టాడు. సల్మాన్ భట్, యూనిస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్‌ల వికెట్లు వరుసగా మూడు బంతుల్లో సాధించిన ఇర్ఫాన్ పాకిస్థాన్‌పై హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు. 


అయితే ఈ మ్యాచ్‌కి ముందు తన తండ్రితో మహ్మద్ యూసుఫ్ ఏమన్నాడో ఇటీవల ఇర్ఫాన్ వెల్లడించాడు. ‘‘టూర్‌కి ముందు మా నాన్నని మహ్మద్ యూసుఫ్ కలిశాడు. నా తండ్రి ఇతరులకు ఎంతో గౌరవం ఇస్తారు.  ఎవరితో అయినా మాట్లాడటాన్ని ఆయన ఇష్టపడతారు. అయితే యూసుఫ్ మా నాన్నతో ‘నేను ఔట్ అయినా.. నీ కొడుకు బౌలింగ్‌లో అవ్వకూడదని ప్రార్థన చేయండి’ అని అన్నాడు.  అయితే కరాచీ టెస్ట్‌లో, నా హ్యాట్రిక్ బంతిలో మహ్మద్ యూసుఫ్‌ స్ట్రైక్‌లో ఉన్నాడు. కాబట్టి అతన్ని ఔట్ చేయడానికి అదే సరైన అవకాశం అనిపించింది. అదృష్టవశాత్తు నా ప్లాన్ పని చేసింది. అతని వికెట్ నాకు వచ్చింది’’ అని ఇర్ఫాన్ తెలిపాడు. 

Updated Date - 2020-06-02T01:25:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising