ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్‌.. విదేశాలకు తరలింపు?

ABN, First Publish Date - 2020-06-05T09:15:16+05:30

కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌-2020పై అనిశ్చితి కొనసాగుతోంది. అయితే, ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడితే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌-2020పై అనిశ్చితి కొనసాగుతోంది. అయితే, ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడితే ఆ విండోలో ఐపీఎల్‌ను నిర్వహిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. కానీ, ప్రస్తుతానికి ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అంతటా స్తబ్దత నెలకొంది. కానీ, ఈ ఏడాది ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. దేశంలో కరోనా అదుపులోకి రాకపోతే భారత్‌కు ఆవల మెగా లీగ్‌ను నిర్వహించే అవకాశాలనూ పరిశీలిస్తున్నామని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధూమల్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘దేశంలో ఆడడం మన ఆటగాళ్లకు భద్రమేనా? అలాగైతే స్వదేశంలో నిర్వహించడానికే తొలి ప్రాధాన్యత. ప్లేయర్ల భద్రతపై అనుమానాలుంటే మాత్రం విదేశాల్లో లీగ్‌ను నిర్వహించే విషయం గురించి ఆలోచిస్తామ’ని అరుణ్‌ చెప్పారు. ‘గతంలో దక్షిణాఫ్రికాలో నిర్వహించాం. లీగ్‌ను విదేశాలకు తరలించడానికి ఇష్టపడం. కానీ, పరిస్థితులు అనుకూలించకపోతే చేసేదేం లేదు’ అని అన్నారు. కరోనా అదుపులో ఉన్న నేపథ్యంలో ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించాలని శ్రీలంక కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే, అది అంత సులభం కాదని అరుణ్‌ చెప్పారు. జాతీయ క్యాంప్‌ను పునః ప్రారంభించే విషయమై సమాలోచన చేస్తున్నట్టు తెలిపారు. ‘లాక్‌డౌన్‌ను ఎత్తేసే విషయంలో రాష్ట్రాలు ఒక్కో పద్ధతిని అనుసరిస్తున్నాయి. అందరూ ఒక చోటకి చేరేందుకు సురక్షితమని భావించే వరకు.. ఆటగాళ్లు ఆయా రాష్ట్ర సంఘాలతో సమన్వయం చేసుకుని సాధన చేయాలి’ అని సూచించారు. 

Updated Date - 2020-06-05T09:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising