ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్‌ ప్రైజ్‌మనీ సగానికి కోత

ABN, First Publish Date - 2020-03-05T09:50:40+05:30

కాసులు కురిపించే ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకొంది. ఖర్చులు తగ్గించుకొనే చర్యల్లో భాగంగా ఈ నెల 29 నుంచి జరిగే 13వ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజేతకు రూ. 20 కోట్ల నుంచి 10 కోట్లకు తగ్గింపు

పొదుపు చర్యల్లో బీసీసీఐ

న్యూఢిల్లీ: కాసులు కురిపించే ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకొంది. ఖర్చులు తగ్గించుకొనే చర్యల్లో భాగంగా ఈ నెల 29 నుంచి జరిగే 13వ ఐపీఎల్‌ ప్రైజ్‌మనీని సగానికి కోత వేసింది. ఇదే విషయాన్ని ఫ్రాంచైజీలకు తెలియజేసింది. గత సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ అందించగా.. ఈ సీజన్‌లో రూ. 10 కోట్లు మాత్రమే ఇవ్వనుంది. రన్నర్‌పగా నిలిచిన టీమ్‌కు రూ. 12.5 కోట్లకు బదులు రూ. 6.25 కోట్లు, క్వాలిఫయర్స్‌లో ఓడిన రెండు టీమ్‌లకు రూ. 4.3 కోట్ల చొప్పున ఇవ్వనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ‘ఫ్రాంచైజీలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. స్పాన్సర్‌షిప్స్‌, ఇతర విధానాల్లో వారికి భారీ ఆదాయం సమకూరుతోంద’ని బోర్డు వర్గాలు తెలిపాయి. 

ఫ్రాంచైజీల అసంతృప్తి 

ప్రైజ్‌మనీ మొత్తాన్ని భారీగా తగ్గించడంపై ఎనిమిది ఫ్రాంచైజీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. నిర్ణయం తీసుకొనే ముందు కనీస సమాచారం కూడా అందించలేదని ఆరోపిస్తున్నాయి. 


Updated Date - 2020-03-05T09:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising