ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్‌ కాంట్రాక్టులు దక్కవని..

ABN, First Publish Date - 2020-04-08T09:04:00+05:30

ఆస్ట్రేలియాతో క్రికెట్‌ మ్యాచ్‌లంటే ముందుగా గుర్తుకు వచ్చేది.. స్లెడ్జింగ్‌. ప్రత్యర్థి ఎవరైనా సరే రెచ్చగొట్టే మాటలతో వారిని కవ్విస్తూ ఆటపై దృష్టి కోల్పోయేలా చేస్తూ పైచేయి సాధిస్తుంటారు. స్వదేశంతో పాటు, ఇతర దేశాల్లో పర్యటించినా వీరి తీరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మా వాళ్లు భయపడ్డారు!
  • ఆసీస్‌ ఆటగాళ్లపై క్లార్క్‌ విమర్శ


మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో క్రికెట్‌ మ్యాచ్‌లంటే ముందుగా గుర్తుకు వచ్చేది.. స్లెడ్జింగ్‌. ప్రత్యర్థి ఎవరైనా సరే రెచ్చగొట్టే మాటలతో వారిని కవ్విస్తూ ఆటపై దృష్టి కోల్పోయేలా చేస్తూ పైచేయి సాధిస్తుంటారు. స్వదేశంతో పాటు, ఇతర దేశాల్లో పర్యటించినా వీరి తీరు మారదు. ఇక, భారత్‌తో మ్యాచ్‌లంటే ఇంకాస్త మితిమీరేవారు. 2007-08, 2018 ఆసీస్‌ టూర్‌లో భారత్‌ను ఓ ఆటాడుకున్నారు. మంకీ గేట్‌ ఉదంతం ఎంత సంచలనం సృష్టించిందో మర్చిపోగలమా.. కానీ ఇటీవల టీమిండియాతో ఆడుతున్నప్పుడు వీరి ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని కవ్వించేందుకు ఇష్టపడడం లేదని, దీనికంతటికీ ఐపీఎల్‌నే కారణమని తేల్చాడు. ఎందుకంటే విరాట్‌ను లక్ష్యంగా చేసుకుంటే ఐపీఎల్‌ వేలంలో ఆయా ఫ్రాంచైజీలు తమను కొనుగోలు చేయవేమోనని భయపడ్డారని క్లార్క్‌ ఆరోపించాడు. ‘ఆర్థికంగా చూసుకుంటే ఇతర బోర్డుల కంటే బీసీసీఐ ఎంత శక్తివంతమో అందరికీ తెలుసు. ఐపీఎల్‌ ద్వారానూ ఆటను శాసిస్తోంది. అందుకే ఇతర జట్లతో పాటు ఆసీస్‌ కూడా కొంతకాలంగా కోహ్లీ సేనపై సానుకూల ధోరణిలో ఉంటోంది. భారత క్రికెటర్లపై స్లెడ్జింగ్‌కు దిగితే ఐపీఎల్‌లో దెబ్బ పడుతుందనే ఆందోళన వారిలో కనిపించింది. కొందరైతే..‘కోహ్లీని స్లెడ్జింగ్‌ చేయను. ఎందుకంటే అతడి బెంగుళూరు జట్టులో నేను ఆడాలనుకుంటున్నా. అనవసరంగా నోరు పారేసుకుని నష్టపోవడం ఎందుకు?’ అనే అభిప్రాయంతో ఉండేవారు. దీంతో ఆసీ్‌సకు సహజసిద్ధంగా ఉండే దూకుడు ఇప్పుడు కనిపించడం లేదని క్లార్క్‌ చెప్పుకొచ్చాడు.


బాగానే సొమ్ము చేసుకున్నారు..: గత డిసెంబర్‌లో జరిగిన క్రికెటర్ల వేలంలో ఆసీస్‌ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తిని ప్రదర్శించాయి. కమిన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏకంగా రూ.15.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఓ విదేశీ క్రికెటర్‌కు ఇంత ధర పలకడం లీగ్‌ చరిత్రలో ఇదే తొలిసారి. అలాగే మ్యాక్స్‌వెల్‌ రూ.10.75 కోట్లు (పంజాబ్‌), కల్టర్‌నైల్‌ రూ.8 కోట్లు (ముంబై) తమ ఖాతాలో వేసుకున్నారు. వీరే కాకుండా చాలా మంది ఆసీస్‌ ఆటగాళ్లు కోట్లలో ధర పలికారు. కొందరైతే ఆయా జట్లకు కెప్టెన్లుగా కూడా కొనసాగుతుండడం విశేషం.

Updated Date - 2020-04-08T09:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising