ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోర్నమెంట్ చివర్లో ఐపీఎల్ ఆల్-స్టార్ మ్యాచ్

ABN, First Publish Date - 2020-02-21T22:25:36+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌కి ముందు అన్ని జట్ల ఆటగాళ్లు రెండు జట్లగా ఏర్పడి.. ఆల్ స్టార్స్ మ్యాచ్ పేరిట ఛారిటీ మ్యాచ్ నిర్వహించాలని ఐపీఎల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌కి ముందు అన్ని జట్ల ఆటగాళ్లు రెండు జట్లగా ఏర్పడి.. ఆల్ స్టార్స్ మ్యాచ్ పేరిట ఛారిటీ మ్యాచ్ నిర్వహించాలని ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆడే జట్లు ఇవే అంటూ సోషల్‌మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ మ్యాచ్‌ని రద్దు చేశారంటూ.. గత కొంతకాలంగా సోషల్‌మీడియాలో పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఈ పుకార్లను ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ తోసిపుచ్చారు. ఆల్ స్టార్ మ్యాచ్ రద్దు కాలేదని.. టోర్నమెంట్ చివరికి మ్యాచ్ వాయిదా వేశామని ఆయన అన్నారు. 


ముంబై మిర్రర్ అనే పత్రిక ఆల్ స్టార్ మ్యాచ్ రద్దైంది అంటూ కథనాన్ని ప్రచూరించింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాంచైజీల్లోని ప్రధాన ఆటగాళ్లకు గాయాలు అయితే.. టోర్నమెంట్‌లో ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందన్న కారణంగా ఈ మ్యాచ్‌ని రద్దు చేశారని సదరు పత్రిక పేర్కొంది. అయితే ఈ వార్త అవాస్తవమని పటేల్ తెలిపారు. 


ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పటేల్ మాట్లాడుతూ.. ‘‘మేము మ్యాచ్‌ని రద్దు చేయలేదు. దాన్ని టోర్నమెంట్ చివరికి వాయిదా వేశామంతే. అందరు ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారో మేము గమనించాలి. దాని ఆధారంగానే ఆల్-స్టార్ మ్యాచ్ కోసం జట్లను సిద్ధం చేశాము. 

Updated Date - 2020-02-21T22:25:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising