ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్ నుంచి తిరిగివెళ్లిన.. సౌతాఫ్రికా క్రికెటర్లు సేఫ్..

ABN, First Publish Date - 2020-04-04T22:54:36+05:30

టీం ఇండియాకు వన్డే టూర్ కోసం వచ్చిన సౌతాఫ్రికా క్రికెటర్ల ఆరోగ్యంగా ఉన్నట్లు టీం చీఫ్ మెడికల్ ఆఫీసర్ షుయబ్ మంజ్రా తెలిపారు. కరోనా వ్యాప్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జొహెన్నెస్‌బర్గ్: టీం ఇండియాకు వన్డే టూర్ కోసం వచ్చిన సౌతాఫ్రికా క్రికెటర్ల ఆరోగ్యంగా ఉన్నట్లు ఆ టీం చీఫ్ మెడికల్ ఆఫీసర్ షుయబ్ మంజ్రా తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత్‌తో జరగాల్సిన వన్డే సిరీస్‌ రద్దు కావడంతో.. మార్చి 18వ తేదీన ఆటగాళ్లు సౌతాఫ్రికాకు తిరిగి వెళ్లారు. అయితే సౌతాఫ్రికాకు వెళ్లిన వెంటనే ఆటగాళ్లు సెల్ఫ్ 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. 


అయితే ఈ పరీక్షల్లో ఎవరికి వైరస్ సోకలేదని నిర్ధారణ జరిగింది. అయితే 14 రోజుల కాలం ముగియడంతో వాళ్లను ఐసోలేషన్ నుంచి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా తెలిపారు. అయితే మిగితా దేశంతో పాటు వాళ్లు లాక్‌డౌన్‌లోనే ఉంటారు. మార్చి 12వ తేదీన ధర్మశాల వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఆ తర్వాత వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో.. సిరీస్‌ను రద్దు చేశారు. 


అయితే సౌతాఫ్రికా క్రికెటర్ల ఫిట్‌నెస్‌ గురించి ట్రైనర్ టుమి మసెకెలా మాట్లాడుతూ.. అందరికి ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు ఇచ్చామని తెలిపారు. ‘‘ఆటగాళ్లకు అవసరమైన సమయం దొరికింది. ఈ సమయంలో వాళ్లు తమకు ఉన్న చిన్నపాటి సమస్యలను తగ్గించుకోవాలి’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-04T22:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising