ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చివర్లో గట్టెక్కారు..

ABN, First Publish Date - 2020-02-19T09:56:12+05:30

బ్యాట్స్‌వుమెన్‌ మరోసారి నిరాశపరిచినా బౌలర్లు మాత్రం చివరి వరకుపోరాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళల టీ20 ప్రపంచకప్‌ మరో 2 రోజుల్లో.. 

వెస్టిడీ్‌సపై భారత మహిళల విజయం

వామప్‌ మ్యాచ్‌

బ్రిస్బేన్‌: బ్యాట్స్‌వుమెన్‌ మరోసారి నిరాశపరిచినా బౌలర్లు మాత్రం చివరి వరకుపోరాడారు. దీంతో మంగళవారం వెస్టిండీ్‌సతో జరిగిన టీ20 ప్రపంచకప్‌ వామప్‌ మ్యాచ్‌లో భారత్‌ రెండు పరుగుల తేడాతో నెగ్గింది. ఆఖరి ఓవర్‌లో విండీ్‌సకు 11 పరుగులు కావాల్సిన దశలో స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ (3/20) రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోనీయలేదు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులే చేయగలిగింది. టాప్‌ బ్యాటర్స్‌ అంతా విఫలం కాగా తొమ్మిదో నెంబర్‌లో బరిలోకి దిగిన శిఖా పాండే (24) టాప్‌ స్కోరర్‌గా నిలవడం గమనార్హం. ఆతర్వాత ఛేదనలో విండీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 105 పరుగులు చేసి ఓడింది. లీ ఆన్‌ కిర్బీ (42) రాణించింది. 57/1తో స్కోరున్న దశలో విండీస్‌ విజయం సులువే అనిపించినా కిర్బీని దీప్తి శర్మ అవుట్‌ చేయడంతో విండీస్‌ తడబడింది. 10 పరుగుల తేడాతోనే నాలుగు వికెట్లను కోల్పోయింది. అయితే చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు వచ్చాయి. కానీ 20వ ఓవర్‌లో పూనమ్‌ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పాటు రెండు వికెట్లు తీసి 8 పరుగులే ఇవ్వగా విండీ్‌సకు ఓటమి తప్పలేదు.


Updated Date - 2020-02-19T09:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising