ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసీసీ అంపైర్ ప్యానెల్‌లోకి అనంతపద్మనాభన్

ABN, First Publish Date - 2020-08-11T21:46:35+05:30

దేశానికి చెందిన మరో అంపైర్ ఐసీసీ అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్‌కు ఎంపికయ్యారు. కేరళకు చెందిన కేఎన్ అనంతపద్మనాభన్ ఐపీఎల్‌తో పాటు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశానికి చెందిన మరో అంపైర్ ఐసీసీ అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్‌కు ఎంపికయ్యారు. కేరళకు చెందిన కేఎన్ అనంతపద్మనాభన్ ఐపీఎల్‌తో పాటు అనేక ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆయనే అంపైరింగ్ చేశారు. అయితే ఈ ప్యానెల్‌కు ఎంపికవ్వడంతో ఇక నుంచి అంతర్జాతీయస్థాయి వన్డే, టీ20లకు కూడా పద్మనాభన్ అంపైరింగ్ చేయనున్నారు. సీ షంషుద్దీన్, అనిల్ చౌదరి, వీరేంద్ర శర్మ వంటి భారత అంపైర్‌లు ఇప్పటికే ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్‌లో స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో అనంతపద్మనాభన్ కూడా వారితో చేరనున్నారు. మరోవైపు దేశానికే చెందిన నితిన్ మీనన్ ఐసీసీ అంతర్జాతీయ అంపైరింగ్ ఎలైట్ ప్యానెల్‌కు ఉద్యోగోన్నతి పొందారు. ఇదిలా ఉంటే పద్మనాభన్ స్పిన్నర్‌గా తన కెరీర్‌లో 105 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఆడి 344 వికెట్లు తీశారు. 54 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 87 వికెట్లు తీశారు.

Updated Date - 2020-08-11T21:46:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising