ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వార్న్‌ను తొలి సారి కలిసినప్పుడు నోటమాట రాలేదు: కుల్దీప్

ABN, First Publish Date - 2020-08-14T23:12:11+05:30

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, మాజీ స్పిన్నర్ షేన్ వార్న్‌ను కలవడం ప్రతి యువ స్పిన్నర్‌కు అద్భుతమైన అనుభవం. ఇలాంటి అనుభవాన్నే తాను కూడా ఫీల్ అయ్యానని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, మాజీ స్పిన్నర్ షేన్ వార్న్‌ను కలవడం ప్రతి యువ స్పిన్నర్‌కు అద్భుతమైన అనుభవం. ఇలాంటి అనుభవాన్నే తాను కూడా ఫీల్ అయ్యానని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. వార్న్‌ను తొలి సారి కలిసినప్పుడు తన నోట మాట రాలేదని, దాదాపు 10నిముషాలపాటు అలా చూస్తూ ఉండిపోయానని కుల్దీప్ చెప్పాడు. కొంత సేపటికి తేరుకొని వార్న్‌తో మాట్లాడానని, తన బౌలింగ్ గురించి చర్చించానని తెలిపాడు. ‘2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా నేను టెస్టులలోకి అడుగు పెట్టాను. అప్పుడే టీమ్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే నన్ను షేన్ వార్న్‌కు పరిచయం చేశారు. అయితే మొదటిసారి వార్న్‌ను చూడగానే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. 10నిముషాలపాటు అలా నిలబడిపోయా. ఈ లోపు కుంబ్లే, వార్న్ ఏదో విషయంపై మాట్లాడుకున్నారు. కొంత సేపటికి నేను కూడా వార్న్‌తో మాట్లాడటం ప్రారంభించాను. నేను బౌలింగ్ వేసే విధానం, ప్రతి బంతి వేసేటప్పుడు ఎలా ఆలోచిస్తాను అనే విషయాలన్ని వార్న్‌కు వివరించాను. నా మాటలన్నీ విన్న తరువాత అంత ఆలోచించాల్సిన అవసరం లేదని, బౌలింగ్‌పై ఏకాగ్రతతో ఉంటూ ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చాడు. ఆ సిరీస్ తరువాత మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. అనేక సార్లు బౌలింగ్‌లో అతడి సలహాలు, సూచనలు తీసుకున్నాను. అంతే కాకుండా వార్న్ నాకో మంచి కోచ్‌గా, మార్గదర్శకుడిగా కూడా అండగా ఉంటున్నాడ’ని కుల్దీప్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-14T23:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising