ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో వన్డేలోనూ భారీ స్కోర్ దిశగా ఆసీస్ జట్టు

ABN, First Publish Date - 2020-11-29T17:49:55+05:30

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా రెండో వన్డే కొనసాగుతోంది. రెండో వన్డేలోనూ ఆసీస్ బ్యాట్స్‌మన్ తమ జోరు కొనసాగిస్తున్నారు. 40 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ జట్టు రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 275 పరుగులు చేసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా రెండో వన్డే కొనసాగుతోంది. రెండో వన్డేలోనూ ఆసీస్ బ్యాట్స్‌మన్ తమ జోరు కొనసాగిస్తున్నారు. 40 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ జట్టు రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 275  పరుగులు చేసి.. భారీ స్కోర్ దిశగా వెళ్తుంది. క్రీజులో స్మిత్ 57 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ తో.. 88 రన్స్ చేసి దూకుడుగా ఆడుతున్నారు. స్మిత్‎కి తోడుగా లబుషేన్‌ 38 బంతుల్లో 38 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.

అంతకుముందు ఆసీస్‌ ఓపెనర్ల జోరుకు భారత పేసర్‌ షమీ బ్రేక్‌ వేశాడు. ఓపెనర్లుగా వచ్చిన వార్నర్ 77 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లతో 83 పరుగులు చేసి రనౌట్ కాగా.. ఫించ్‌ (69 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‎తో) 60 పరుగుల వద్ద ఔటయ్యాడు. 

Updated Date - 2020-11-29T17:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising