ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

ABN, First Publish Date - 2020-12-02T14:53:04+05:30

మూడు వన్డేల సిరీస్‎లో భాగంగా ఇక్కడి మనుకా ఓవల్, కాన్బెర్రా క్రికెట్ స్టేడియం వేదికగా చివరి వన్డేలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్లు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓవల్: మూడు వన్డేల సిరీస్‎లో భాగంగా ఇక్కడి మనుకా ఓవల్, కాన్బెర్రా క్రికెట్ స్టేడియం వేదికగా చివరి వన్డేలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా జట్టు సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత రెండు వన్డే మ్యాచ్‎ల్లో భారత్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత్ జట్టు.. ఈ మ్యాచ్ నైనా గెలవాలని కసితో ఉంది. మరోవైపు ఆసీస్ జట్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. అయితే.. చివరి వన్డేలో మాత్రం భారత్ జట్టు భారీగా మార్పులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ప్లేస్‎లో శుభమన్ గిల్ రాగా... పేసర్ సైని, షమీ, చాహల్ స్థానాల్లో నటరాజన్, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‎ను జట్టులోకి తీసుకున్నారు. ఈ వన్డేతో పేసర్ నటరాజన్ అంతర్జాతీయ క్రికెట్‎లో అరంగ్రేటం చేస్తున్నాడు.


జట్ల వివరాలు

ఇండియా: శిఖర్ ధావన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, టి నటరాజన్


ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), లబుషేన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్ వెల్, హెన్రిక్స్, అలెక్స్ కేరీ, కామెరన్ గ్రీన్, అస్టన్ అగర్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, హాజిల్‌వుడ్

Updated Date - 2020-12-02T14:53:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising