ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ X ఇంగ్లండ్‌

ABN, First Publish Date - 2020-03-04T09:47:41+05:30

మహిళల టీ20 ప్రపంచక్‌పలో సెమీఫైనల్స్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి టైటిల్‌పై కన్నేసిన భారత జట్టు పటిష్ఠ ఇంగ్లండ్‌ను ఎదుర్కోబోతోంది. 2018 టోర్నీలోనూ ఇదే ప్రత్యర్థితో తలపడిన హర్మన్‌ప్రీత్‌ సేనకు ఓటమి ఎదురైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా జూ సెమీస్‌ బెర్త్‌లు ఖరారు


సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచక్‌పలో సెమీఫైనల్స్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి టైటిల్‌పై కన్నేసిన భారత జట్టు పటిష్ఠ ఇంగ్లండ్‌ను ఎదుర్కోబోతోంది. 2018 టోర్నీలోనూ ఇదే ప్రత్యర్థితో తలపడిన హర్మన్‌ప్రీత్‌ సేనకు ఓటమి ఎదురైంది. మంగళవారం జరగాల్సిన గ్రూప్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఈ కారణంగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ జట్ల మధ్య టాస్‌ కూడా వీలుకాకపోవడంతో ఇరుజట్లకు చెరో పాయింట్‌ ఇచ్చారు. గ్రూప్‌-బి నుంచి దక్షిణాఫ్రికా (7) టాప్‌నకు చేరగా ఇంగ్లండ్‌ (6) రెండోస్థానంతో సరిపెట్టుకుంది. దీంతో గ్రూప్‌-ఎ టాపర్‌ భారత్‌తో ఇంగ్లండ్‌ సెమీస్‌ పోరు ఖాయమైంది. గ్రూప్‌-ఎలో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. ఈ రెండు సెమీస్‌లు గురువారం సిడ్నీలోనే జరుగుతాయి. సెమీస్‌ కూడా వర్షం కారణంగా రద్దయితే తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌, దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరతాయి. 

థాయ్‌లాండ్‌ జోరు: గ్రూప్‌-బిలో జరిగిన పాక్‌-థాయ్‌లాండ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా జరగలేదు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన థాయ్‌లాండ్‌ 20 ఓవర్లలో 150/3 స్కోరు చేసింది. ఆ తర్వాత భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

Updated Date - 2020-03-04T09:47:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising