ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైత్రయాత్రకు బ్రేక్‌

ABN, First Publish Date - 2020-12-09T10:10:33+05:30

ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్‌లో వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియాకు ఆసీస్‌ కళ్లెం వేసింది. 187 పరుగుల ఛేదనలో తొలి ఓవర్‌లోనే క్రీజులో అడుగుపెట్టిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దాదాపు చివరి వరకు పోరాటం సాగించాడు. కానీ స్పిన్నర్‌ స్వెప్సన్‌ ధాటికి సహచరుల నుంచి మద్దతు లభించకపోవడం భారత్‌ను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చివరి మ్యాచ్‌లో భారత్‌ ఓటమి

పోరాడిన కోహ్లీ

2-1తో సిరీస్‌ సొంతం

ఆసీస్‌ ఓదార్పు విజయం 


ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్‌లో వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియాకు ఆసీస్‌ కళ్లెం వేసింది. 187 పరుగుల ఛేదనలో తొలి ఓవర్‌లోనే క్రీజులో అడుగుపెట్టిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దాదాపు చివరి వరకు పోరాటం సాగించాడు. కానీ స్పిన్నర్‌ స్వెప్సన్‌ ధాటికి సహచరుల నుంచి మద్దతు లభించకపోవడం భారత్‌ను దెబ్బతీసింది. తద్వారా వరుసగా 11 మ్యాచ్‌ల తర్వాత జట్టు తొలి ఓటమిని ఎదుర్కొంది. అటు ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో వేడ్‌, మ్యాక్స్‌వెల్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో తమ జట్టును వైట్‌వాష్‌ నుంచి తప్పించారు.


సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20లో భారత జట్టుకు ఓటమి ఎదురైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (61 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 85) కళ్లు చెదిరే ఆటతో మెరుపులు మెరిపించాడు. కానీ అతడొక్కడి పోరాటం ఛేదనకు సరిపోలేదు. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 12 పరుగుల తేడాతో ఓదార్పు విజయం దక్కించుకుంది. అయినా తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్‌ 2-1తో సిరీ్‌సను ముగించింది. ఈనెల 17 నుంచి టెస్టు సిరీస్‌ మొదలవనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ (53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 80), మ్యాక్స్‌వెల్‌ (36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) అర్ధసెంచరీలు సాధించారు. వాషింగ్టన్‌ సుం దర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగు లకే పరిమితమైంది. ధవన్‌ (28), హార్దిక్‌ (20) ఫర్వాలేదనిపించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ స్వెప్సన్‌కు 3 వికెట్లు దక్కాయి. హార్దిక్‌ పాండ్యా మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు.


అంతా తానై: రెండో వన్డేలో ఇంతకంటే పెద్ద లక్ష్యాన్ని సమష్టి ఆటతీరుతో ఛేదించిన భారత్‌ ఈసారి బోల్తా పడింది. కోహ్లీకి మిడిలార్డర్‌ నుంచి సహకారం లభించలేదు. అయినా చివరి దాకా అంతా తానై ఇన్నింగ్స్‌ను కదం తొక్కించాడు. కానీ కీలక సమయంలో వికెట్‌ కోల్పోవడం జట్టు ఫలితంపై ప్రభావం చూపింది. అంతకుముందు తొలి ఓవర్‌లోనే రాహుల్‌ (0) వికెట్‌తో మ్యాక్స్‌వెల్‌ ఝలకిచ్చాడు. కోహ్లీ, ధవన్‌ మాత్రం బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని రెండో వికెట్‌కు 74 పరుగులందించారు. వాస్తవానికి కోహ్లీ తన తొమ్మిది పరుగుల వద్దే అవుటయ్యేవాడు. మిడ్‌ వికెట్‌లో స్మిత్‌ సులువైన క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయాడు. అయితే స్పిన్నర్‌ స్వెప్సన్‌ స్వల్ప వ్యవధిలోనే ధవన్‌, సంజూ శాంసన్‌ (10), శ్రేయాస్‌ అయ్యర్‌ (0)ను అవుట్‌ చేయడంతో భారత్‌ 100/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో కోహ్లీ మరింత జోరు చూపుతూ 16వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో చెలరేగాడు. అటు పాండ్యా మరో సిక్సర్‌ బాదడంతో జట్టుకు 20 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్‌లో పాండ్యా 4,6 బాదడంతో జట్టు గెలుపు దిశగా సాగుతున్నట్టనిపించింది. అయితే, 3 ఓవర్లలో 43 రన్స్‌ అవసరమవగా వరుస ఓవర్లలో పాండ్యాను జంపా, కోహ్లీని ఆండ్రూ టై అవుట్‌చేయడంతో భా రత్‌ ఆశలు కోల్పోయింది. చివర్లో శార్దూల్‌ (17 నా టౌట్‌) సిక్సర్లు ఓటమి అంతరాన్ని తగ్గించాయి.


వేడ్‌, మ్యాక్సీ మెరుపులు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ రెండో ఓవర్‌లోనే ఫించ్‌ (0) వికెట్‌ను కోల్పోయింది. కానీ స్మిత్‌తో కలిసి వేడ్‌ విజృంభించాడు. రెండో వికెట్‌కు 65 రన్స్‌ జత చేసిన తర్వాత సుందర్‌ ఓవర్‌లో స్మిత్‌ వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ స్విచ్‌, లాఫ్టెడ్‌ షాట్లతో జోరు ప్రదర్శించాడు. తాను 19 రన్స్‌ వద్ద ఉన్నప్పుడు రాహుల్‌ క్యాచ్‌ పట్టినా చాహల్‌ నోబ్‌తో మ్యాక్స్‌కు లైఫ్‌ లభించింది. అటు 34 బంతుల్లో వేడ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. సిక్సర్లతో రెచ్చిపోయిన మ్యాక్సీ కూడా 30 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. 19వ ఓవర్‌లో వేడ్‌ను ఠాకూర్‌ అవుట్‌ చేయగా, అదే ఓవర్‌లో మ్యాక్స్‌ క్యాచ్‌ను చాహల్‌ వదిలేశాడు. కానీ చివరి ఓవర్‌లో అతడు నటరాజన్‌కు చిక్కాడు. 


1 - టీ20 ఫార్మాట్‌లో 25 సార్లు 50+ స్కోర్లు సాధించిన కోహ్లీ. రోహిత్‌తో కలిసి సంయుక్తంగా అగ్ర స్థానంలో ఉన్నాడు.


స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా: వేడ్‌ (ఎల్బీ) శార్దూల్‌ 80; ఫించ్‌ (సి) హార్దిక్‌ (బి) సుందర్‌ 0; స్మిత్‌ (బి) సుందర్‌ 24; మ్యాక్స్‌వెల్‌ (బి) నటరాజన్‌ 54; హెన్రిక్స్‌ (నాటౌట్‌) 5; డార్సీ షార్ట్‌ (రనౌట్‌) 7; సామ్స్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 186/5. వికెట్ల పతనం: 1-14, 2-79, 3-169, 4-175, 5-182. బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-34-0; వాషింగ్టన్‌ సుందర్‌ 4-0-34-2; నటరాజన్‌ 4-0-33-1; చాహల్‌ 4-0-41-0; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-43-1.

భారత్‌: రాహుల్‌ (సి) స్మిత్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 0; ధవన్‌ (సి) సామ్స్‌ (బి) స్వెప్సన్‌ 28; కోహ్లీ (సి) సామ్స్‌ (బి) టై 85; శాంసన్‌ (సి) స్మిత్‌ (బి) స్వెప్సన్‌ 10; శ్రేయాస్‌ (ఎల్బీ) స్వెప్సన్‌ 0; హార్దిక్‌ (సి) ఫించ్‌ (బి) జంపా 20; సుందర్‌ (సి) టై (బి) అబాట్‌ 7; శార్దూల్‌ (నాటౌట్‌) 17; చాహర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 174/7. వికెట్ల పతనం: 1-0, 2-74, 3-97, 4-100, 5-144, 6-151, 7-164. బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 3-0-20-1; అబాట్‌ 4-0-49-1; సామ్స్‌ 2-0-29-0; టై 4-0-31-1; స్వెప్సన్‌ 4-0-23-3; జంపా 3-0-21-1.

Updated Date - 2020-12-09T10:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising