ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ x ఆసీస్‌

ABN, First Publish Date - 2020-05-29T09:14:23+05:30

ఊహాగానాలకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తెరదించింది. తమ దేశంలో టీమిండియా పర్యటన పూర్తిస్థాయిలో ఉంటుందని గురువారం ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ప్రకటించిన సీఏ

వెంటనే మహిళల వన్డే సిరీస్‌ కూడా.. 

మెల్‌బోర్న్‌: ఊహాగానాలకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తెరదించింది. తమ దేశంలో టీమిండియా పర్యటన పూర్తిస్థాయిలో ఉంటుందని గురువారం ప్రకటించింది. అక్టోబరులో ప్రారంభం కానున్న టూర్‌లో భాగంగా భారత జట్టు నాలుగు టెస్ట్‌లు, మూడేసి వన్డేలు, టీ20లు ఆడనుంది. ఆగస్టు 9నుంచి జరిగే జింబాబ్వే సిరీస్‌తో ఆస్ట్రేలియాలో క్రికెట్‌కు తెరలేవనుంది. ఈ సిరీ్‌సలో జింబాబ్వే మూడు వన్డేలలో ఆసీ్‌సతో తలపడనుంది. ఇక.. అక్టోబరు 11న బ్రిస్బేన్‌లో తొలి టీ20తో ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన మొదలవనుంది. అక్టోబరు 14న (కాన్‌బెర్రా), అక్టోబరు 17న (అడిలైడ్‌) మిగిలిన రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20ల తర్వాత భారత జట్టు నాలుగు టెస్ట్‌లలో ఆస్ట్రేలియాను ఢీకొననుంది. ఇక మూడు వన్డేలలో తొలి మ్యాచ్‌ జనవరి 12న పెర్త్‌లో జరగనుంది. భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరీ్‌సకోసం ఆస్ట్రేలియా రానుంది. వాస్తవంగా ఈ సిరీస్‌ అనంతరం టీ20 ప్రపంచకప్‌ జరగాలి. కానీ కరోనాతో ఈ టోర్నీపై నీలినీడలు కమ్ముకున్నాయి. దానికి బలం చేకూర్చేలా టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించిన వివరాలను క్రికెట్‌ ఆస్ట్రేలియా తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం. 


Updated Date - 2020-05-29T09:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising