‘గులాబీ’ ప్రాక్టీస్ నేటినుంచే
ABN, First Publish Date - 2020-12-11T09:25:18+05:30
ఆస్ట్రేలియాతో ఈనెల 17 నుంచి జరగబోయే తొలి డే/నైట్ టెస్టు కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు సన్నాహకంగా శుక్రవారం నుంచి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆసీస్ ‘ఎ’తో జరిగే మూడు రోజుల వామప్...
- ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆసీస్ ‘ఎ’తో మ్యాచ్
- కోహ్లీ అనుమానమే!
- ఉదయం 9.30 గంటల నుంచి సోనీ సిక్స్, డీడీల్లో
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఈనెల 17 నుంచి జరగబోయే తొలి డే/నైట్ టెస్టు కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు సన్నాహకంగా శుక్రవారం నుంచి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆసీస్ ‘ఎ’తో జరిగే మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ ఆడేది అనుమానంగానే ఉంది. అదే జరిగితే రహానె మరోసారి జట్టును నడిపిస్తాడు. ఎప్పటిలాగే ఎస్‌సీజీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. తొలి వామ్‌పలో ఆరంభంలో భారత్ ఇబ్బందిపడినా సాహా అర్ధసెంచరీతో డ్రాగా ముగించిన విష యం తెలిసిందే. ఇక అడిలైడ్‌లో జరిగే తొలి టెస్టు కోసం తుది జట్టును ఎంపిక చేసే విషయంలోనూ ఈ మ్యాచ్ కీలకం కానుంది. పుజార, రహానె చక్కటి ఫామ్‌లో ఉన్నారు. యువ ఓపెనర్లు పృథ్వీ షా, గిల్ భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవాల్సి ఉంది. కీపర్ సాహా తొలి వామ్‌పలో జట్టును ఆదుకున్నాడు. ఒకవేళ పంత్‌ను ఆడిస్తే తొలి టెస్టుకు కూడా అతడినే ఎంపిక చేయవచ్చు. గులాబీ బంతితో ఆడే విషయంలో అందరికంటే ఎక్కువగా కుల్దీప్ కు అనుభవముంది. రెండో స్పిన్నర్‌గా అతడితో పాటు అదనపు బ్యాట్స్‌మన్‌గా హనుమ విహారిని ఉపయోగించుకోవడంపై టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టి సారించింది. బౌలర్ల నుంచి బుమ్రా, షమి, ఉమేశ్, అశ్విన్ ఆడనున్నారు. ఆసీస్ జట్టులో ఆల్‌రౌండర్ గ్రీన్ అదరగొడుతున్నాడు. మరోవైపు ప్రాక్టీస్ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతామని, భారత్‌లాంటి పటిష్ట జట్టుతో ఆడడం చక్కటి అవకాశమని కీపర్ క్యారీ తెలిపాడు.
Updated Date - 2020-12-11T09:25:18+05:30 IST