ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీవ్రవాదులతో ఉంచారు.. గంటలకొద్దీ చిత్రహింసలు పెట్టారు: శ్రీశాంత్

ABN, First Publish Date - 2020-07-02T23:42:28+05:30

ఫిక్సింగ్‌ నేపథ్యంలో తాను దుర్భర జీవితాన్ని గడిపానని భారత పేసర్ శ్రీశాంత్ పేర్కొన్నాడు. విచారణలో భాగంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువతనంతపురం: ఫిక్సింగ్‌ నేపథ్యంలో తాను దుర్భర జీవితాన్ని గడిపానని భారత పేసర్ శ్రీశాంత్ పేర్కొన్నాడు. విచారణలో భాగంగా తనను టెర్రరిస్టులతో పాటు ఉంచారని, గంటలకొద్దీ చిత్రహింసలు పెట్టేవారని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటి పరిస్థితులను తలచుకుంటేనే బాధ, భయం కలుగుతాయని చెప్పుకొచ్చాడు. ‘నన్ను టెర్రరిస్టుల వార్డులోకి తీసుకెళ్లేవారు. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉండేవి. నన్ను వాళ్లిష్టం వచ్చినట్లు  ఆడుకునేవారు. దాదాపు 12 రోజుల పాటు రోజుకు 16 నుంచి 17 గంటల పాటు ఘోరంగా చిత్రహింసలు పెట్టేవారు. ఆ సమయంలో నా ఇల్లు, కుటుంబం ఎంతగానో గుర్తుకొచ్చేవి’ అని శ్రీశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు.


ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్ దాదాపు కెరీర్‌నే కోల్పోయాడు. కోర్టుల చుట్టూ తిరుగుతూ జైళ్లలో గడిపాడు. తొలుత శ్రీశాంత్ జీవితకాలం క్రికెట్ ఆడకుండా బీసీసీఐ నిషేధం విధించినప్పటకీ ఆ తరువాత దానిని ఏడేళ్లుకు తగ్గించింది. ఈ ఏడాది సెప్టెంబరుతో నిషేధం తొలగిపోనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ కేరళ రంజీ జట్టుకు ఆడేందుకు శ్రీశాంత్ కసరత్తు చేస్తున్నాడు.

Updated Date - 2020-07-02T23:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising