ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే కిడ్నీతో.. ఆడి గెలిచా!

ABN, First Publish Date - 2020-12-08T09:51:25+05:30

అంజూ బాబీ జార్జ్‌.. కేరళకు చెందిన ఈ మాజీ లాంగ్‌జంపర్‌ 2003 ప్రపంచ చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకం గెలుపొందిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. అంతేనా.. వరల్ల్‌ అథ్లెటిక్స్‌ ఫైనల్లో స్వర్ణం నెగ్గిన ఏకైక భారత అథ్లెట్‌గానూ రికార్డుకెక్కిన సంగతి గుర్తుందిగా. ఈ ఘనతలు సాధించాలంటే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంచలన విషయం వెల్లడించినమాజీ లాంగ్‌జంపర్‌ అంజూ


న్యూఢిల్లీ: అంజూ బాబీ జార్జ్‌.. కేరళకు చెందిన ఈ మాజీ లాంగ్‌జంపర్‌ 2003 ప్రపంచ చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకం గెలుపొందిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. అంతేనా.. వరల్ల్‌ అథ్లెటిక్స్‌ ఫైనల్లో స్వర్ణం నెగ్గిన ఏకైక భారత అథ్లెట్‌గానూ రికార్డుకెక్కిన సంగతి గుర్తుందిగా. ఈ ఘనతలు సాధించాలంటే ఏళ్లకొద్దీ శ్రమించాలి. ఎన్నో త్యాగాలు చేయాలి. వీటితోపాటు ఆరోగ్యం కూడా సహకరించాలి. అలాంటిది ఒకే కిడ్నీతో కూడా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది అంజూ. ఈ సంచలన విషయాన్ని ఆమే వెల్లడించింది. ‘నమ్మండీ.. నమ్మకపోండి. ఒకే కిడ్నీతో ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఉన్నత స్థానానికి చేరిన అతికొద్ది మంది అదృష్టవంతులైన ప్లేయర్లలో నేనూ ఒకరిని. నొప్పులకు ట్యాబ్లెట్‌ వేసుకొంటే అలర్జీ వచ్చేది. అంతేకాదు ఒక కాలి భాగమంతా తిమ్మిరిగా ఉండి జంప్‌ చేసే సమయంలో తీవ్ర అసౌకర్యం కలిగేది.. ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా నేను అనుకున్న విజయాలు సాధించా. ఇదంతా కోచ్‌ అద్భుతం వల్లే జరిగింది’ అని 43 ఏళ్ల అంజూ సోమవారం సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. 


ప్రస్తుత కొవిడ్‌ సమయంలో ప్రాక్టీస్‌ కొరవడి మానసిక ఆందోళనకు లోనవుతున్న అథ్లెట్లలో స్ఫూర్తి నింపేందుకే తాను ఈ విషయాన్ని ఇప్పుడు వెల్లడిస్తున్నానని తెలిపింది.  ‘2001లో కొన్ని కారణాల వల్ల బెంగళూరులో హెల్త్‌ చెకప్‌కు వెళ్లినప్పుడు నాకు ఒక కిడ్నీయే పనిచేస్తోందని తెలిసింది. దీంతో షాకయ్యా. ఆ సమయంలో నా భర్త, కోచ్‌ అయిన రాబర్ట్‌ బాబీ జార్జ్‌ ఎంతో అండగా నిలిచారు. కెరీర్‌ కొనసాగించేలా ప్రోత్సహించారు. ఏదైనా సమస్య అనిపిస్తే నా కిడ్నీ ఇస్తా అని హామీ ఇచ్చారు’ అని అంజూ జార్జ్‌ ట్వీట్‌ చేసింది. 2003లో పారిస్‌ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో లాంగ్‌ జంప్‌లో (6.70 మీ.) అంజూ కాంస్య పతకం నెగ్గింది. సరిగ్గా ఈ మెగా టోర్నీ ఆరంభానికి 20 రోజుల ముందు కిడ్నీ సమస్యతోనే తాను అనారోగ్యానికి గురవడంతో వైద్యులు ఆరు నెలల విశ్రాంతి అవసరమని సూచించారని.. అయినా తాను ఆ టోర్నీలో పోటీపడి పతకం గెలిచానని అంజూ వివరించింది.  2005లో మొనాకోలో జరిగిన వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఫైనల్లో అంజూ స్వర్ణ పతకం నెగ్గింది. ఆ తర్వాత 2008లో అంతర్జాతీయ, 2012లో జాతీయ అథ్లెటిక్స్‌ కెరీర్‌కు ఆమె వీడ్కోలు పలికింది. అంజూ ట్వీట్‌కు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు స్పందిస్తూ.. కఠోర శ్రమ, మొక్కవోని పట్టుదలతో అంజూ దేశానికి ఎన్నో పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చిందని కొనియాడారు.

Updated Date - 2020-12-08T09:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising