ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడేందుకు నేను సిద్ధం: సెరెనా

ABN, First Publish Date - 2020-06-18T07:36:10+05:30

కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమణగకముందే యూఎస్‌ ఓపెన్‌లో ఆడలేమంటూ జొకోవిచ్‌, నడాల్‌లాంటి అగ్రశ్రేణి క్రీడాకారులంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా.. అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ మాత్రం ఆ గ్రాండ్‌స్లామ్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌: కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమణగకముందే యూఎస్‌ ఓపెన్‌లో ఆడలేమంటూ జొకోవిచ్‌, నడాల్‌లాంటి అగ్రశ్రేణి క్రీడాకారులంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా.. అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ మాత్రం ఆ గ్రాండ్‌స్లామ్‌కు పచ్చజెండా ఊపింది. ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు తాను సిద్ధమని తెలిపింది. ఈ మేరకు యూఎస్‌ టెన్నిస్‌ సంఘం టోర్నీ ప్రజెంటేషన్‌ కార్యక్రమం సందర్భంగా విడుదల చేసిన వీడియోలో తన నిర్ణయాన్ని సెరెనా ప్రకటించింది. ఈ గ్రాండ్‌స్లామ్‌లో ఆరుసార్లు విజేతగా నిలిచిన 38 ఏళ్ల సెరెనా.. టోర్నీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఆ వీడియోలో పేర్కొంది. ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 వరకు ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నట్టు టోర్నీ నిర్వాహకులు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-06-18T07:36:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising