ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ ఎదుట 150 పరుగుల విజయ లక్ష్యం.. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమేనా?

ABN, First Publish Date - 2020-11-04T03:04:00+05:30

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షార్జా: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి ప్రత్యర్థి ఎదుట ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబైకి 12 పరుగుల వద్ద తొలి దెబ్బ తగిలింది. గాయం కారణంగా జట్టుకు దూరమై తిరిగొచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ 4 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. డికాక్ (25), సూర్యకుమార్ యాదవ్ (36), ఇషాన్ కిషన్ (33) క్రీజులో కుదురుకున్నట్టు కనిపించినప్పటికీ భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. 


చివర్లో కీరన్ పొలార్డ్ మాత్రం బంతిపై విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. దీంతో జట్టు స్కోరు అమాంతం పెరిగి గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. కృనాల్ పాండ్యా డకౌట్ కాగా, సౌరభ్ తివారీ, కౌల్టర్ నైల్ చెరో పరుగు చేశారు. పాటిన్సన్ 4 , ధవళ్ కుల్‌కర్ణి 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా, జాసన్ హోల్డర్, నదీమ్ చెరో రెండు వికెట్లు, రషీద్ ఒక వికెట్ పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమైనట్టే.

Updated Date - 2020-11-04T03:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising