ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశాల్లో ఐపీఎల్?.. బీసీసీఐ స్పందన ఇదీ!

ABN, First Publish Date - 2020-07-08T03:35:56+05:30

ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహణపై బీసీసీఐ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహణపై బీసీసీఐ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ క్రికెట్ పండుగను విదేశాల్లో నిర్వహించాలని కొందరు సూచించారు. ఈ క్రమంలో తమ దేశాల్లో ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ శ్రీలంక, యూఏఈ వంటి దేశాలు ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి. తాజాగా న్యూజిలాండ్ కూడా తమ దేశంలో ఐపీఎల్ నిర్వహణకు సిద్ధమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ సింగ్ ధుమాల్ మంగళవారం ఓ ప్రకటన చేశారు. ‘ఐపీఎల్‌ను భారత్‌లో నిర్వహించడానికే ప్రయత్నిస్తాం. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ చిట్టచివరి మార్గం. ఎటూ దారి లేకపోతే అదే చేస్తామేమో? అయితే దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చిస్తాం’ అని చెప్పారు. దీంతో ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించే అవకాశంపై అభిమానులు రకరకాల ఆలోచనలు చేస్తున్నారు.

Updated Date - 2020-07-08T03:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising