ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బల్‌బీర్ సింగ్ అంత్యక్రియలు పూర్తి.. భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్

ABN, First Publish Date - 2020-05-26T00:16:12+05:30

హాకీ దిగ్గజం పద్మశ్రీ బల్బీర్ సింగ్ సీనియర్(96) సోమవారం ఉదయం క‌న్నుమూసిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్ప‌డ‌టంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఛండీగఢ్: హాకీ దిగ్గజం పద్మశ్రీ బల్బీర్ సింగ్ సీనియర్(96) సోమవారం ఉదయం క‌న్నుమూసిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్ప‌డ‌టంతో బ‌ల్‌బీర్‌సింగ్ ఆసుపత్రి తుదిశ్వాస విడిచారు. సెక్టార్-25లో ఎలక్ట్రికల్ స్మశానంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. 


ఇక బల్‌బీర్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని.. పంజాబ్ క్రీడాశాఖ మంత్రి రానా గుర్మీత్ సింగ్ సోధీ డిమాండ్ చేశారు. ‘‘ఈరోజు మనం కేవలం ఓ దిగ్గజ ఆటగాడినే కాదు.. ఒక గొప్ప మార్గదర్శిని కోల్పోయాము. ఆయనకు క్రీడలు అంటే అమితమైన ఇష్టం. మాకు ఎప్పుడు సలహాకావాలన్న ఇచ్చేవారు. హాకీ ధృవతార నెలరాలింది. క్రీడా రంగానికి చెందిన ప్రతీ ఒక్కరు ఈ వార్త విని బాధపడ్డారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము’’ అని ఆయన అన్నారు. 

Updated Date - 2020-05-26T00:16:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising