ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హ్యాట్రిక్ సిక్స్‌లతో విరుచుకుపడిన ఆసీస్ ఓపెనర్ ఔట్

ABN, First Publish Date - 2020-03-08T19:08:18+05:30

ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ అలిసా హీలి హ్యాట్రిక్ సిక్స్‌లతో విరుచుకుపడింది. శిఖ పాండే బౌలింగ్ చేసిన 11వ ఓవర్‌లో మూడు, నాలుగు, ఐదు బంతులకు వరుస సిక్స్‌లు కొట్టిన హీలి 39 బంతుల్లోనే 75 పరుగులు చేసింది. 5 సిక్స్‌లు, 7 ఫోర్లతో టీమిండియా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేసింది. రాధా యాదవ్ బౌలింగ్ చేసిన 12వ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్‌కు యత్నించిన హీలి.. లాంగ్‌ ఆన్‌లో ఉన్న కృష్ణమూర్తికి క్యాచ్‌గా చిక్కి ఔటైంది.


ఇదిలా ఉంటే.. ఆసీస్ మరో ఓపెనర్ బెత్ మూనీ కూడా 41 బంతుల్లో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ చేసింది. మూనీకి ఇది 9వ టీ20 ఆఫ్ సెంచరీ కావడం గమనార్హం. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 15 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 142 పరుగుల స్కోర్‌ను సాధించింది. ఆసీస్ బ్యాటింగ్ తీరు చూస్తుంటే టీమిండియా ముందు భారీ లక్ష్యం ఉండనుందని స్పోర్ట్స్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2020-03-08T19:08:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising