ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వింబుల్డన్‌ రద్దయినా.. ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ

ABN, First Publish Date - 2020-07-11T09:21:42+05:30

టెన్ని్‌సలో ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌ వింబుల్డన్‌ ఈ ఏడాదికి రద్దయిన సంగతి గుర్తుందిగా! అయితే టోర్నీ జరగకపోయినా ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌: టెన్ని్‌సలో ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్‌ వింబుల్డన్‌ ఈ ఏడాదికి రద్దయిన సంగతి గుర్తుందిగా! అయితే టోర్నీ జరగకపోయినా ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ దక్కనుంది. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. టోర్నీకి ఇప్పటికే బీమా సౌకర్యం ఉంది కాబట్టి.. మొత్తం ప్రైజ్‌మనీ 12.5 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 94 కోట్లు)ను ర్యాంకింగ్స్‌ ఆధారంగా టోర్నీకి అర్హులైన ఆటగాళ్లందరికీ పంచనున్నట్టు తెలిపారు. దీంతో పురుషులు, మహిళల సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల నుంచి మొత్తంగా 620 మంది క్రీడాకారులు లబ్ధి పొందనున్నారు. 

Updated Date - 2020-07-11T09:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising