ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిక్కిరెడ్డికి పాజిటివ్‌

ABN, First Publish Date - 2020-08-14T08:56:07+05:30

డబుల్స్‌ స్టార్‌ షట్లర్‌ సిక్కిరెడ్డి, ఫిజియో కిరణ్‌ కరోనా బారినపడ్డారు. హైదరాబాద్‌లోని గోపీచంద్‌ అకాడమీలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్‌ జాతీయ శిబిరంలో జరిపిన కొవిడ్‌-19 పరీక్షలో సిక్కిరెడ్డి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఫిజియోకు కూడా.. గోపీచంద్‌ అకాడమీ మూసివేత

హైదరాబాద్‌: డబుల్స్‌ స్టార్‌ షట్లర్‌ సిక్కిరెడ్డి, ఫిజియో కిరణ్‌ కరోనా బారినపడ్డారు. హైదరాబాద్‌లోని గోపీచంద్‌ అకాడమీలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్‌ జాతీయ శిబిరంలో జరిపిన కొవిడ్‌-19 పరీక్షలో సిక్కిరెడ్డి, కిరణ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే, ఇద్దరికీ వైరస్‌ లక్షణాలు కనిపించలేదు. సిక్కి, కిరణ్‌తో ప్రాథమిక కాంటాక్టులో ఉన్న వారికి ‘ఆర్టీపీసీఆర్‌’ పరీక్షలు మళ్లీ నిర్వహిస్తున్నట్టు భారత క్రీడా ప్రాఽథికార సంస్థ (సాయ్‌) గురువారం వెల్లడించింది. శానిటైజేషన్‌ కోసం గోపీచంద్‌ అకాడమీని మూసివేసినట్టు కూడా తెలిపింది.


ఈనెల 7న జాతీయ శిబిరం ప్రారంభమైంది. ‘ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయ, పరిపాలన సిబ్బందికి సాయ్‌ తప్పనిసరి చేసిన కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాం. అందులో ఇద్దరికి పాజిటివ్‌గా తే లింది’ అని భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ ప్రకటించాడు. ‘ప్రొటోకాల్‌ ప్రకారం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. అందువల్ల తిరిగి వచ్చాక షట్లర్లంతా ఎలాంటి ఆందోళన లేకుండా సాధన చేసుకోవచ్చు’ అని గోపి తెలిపాడు.


Updated Date - 2020-08-14T08:56:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising