ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను పాకిస్థాన్ వ్యతిరేకిని కాను.. కానీ: గంభీర్

ABN, First Publish Date - 2020-10-07T07:08:24+05:30

మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ మంగళవారం ట్విట్టర్‌లో క్వశ్చన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ మంగళవారం ట్విట్టర్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు గంభీర్ తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. ‘మీరు ఎందుకు పాకిస్థాన్‌ వ్యతిరేకిగా ఉన్నారు?’ అని పాకిస్థాన్‌కు చెందిన ఓ నెటిజన్ గంభీర్‌ను అడిగారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘నేను పాకిస్థాన్‌ వ్యతిరేకిని కాను. నేనే కాదు ఏ ఒక్క భారతీయుడు కూడా పాకిస్థాన్‌కు వ్యతిరేకం అని నేను అనుకోవడం లేదు. కానీ భారత సైనికుల ప్రాణాల విషయానికి వస్తే మాత్రం భారతీయులంతా ఒకే పక్క ఉంటారు’ అని గంభీర్ సమాధానమిచ్చారు. 


‘క్రికెట్ గ్రౌండ్‌లోకి, పార్లమెంట్‌లోకి ప్రవేశించేటప్పుడు మీ అనుభూతి ఒకే విధంగా ఉందా? వేరే విధంగా ఉందా?‘ అని మరో నెటిజన్ గంభీర్‌ను అడిగాడు. దీనిపై స్పందిస్తూ.. తనకు రెండూ ఒకే విధమైన అనుభూతినిచ్చాయని.. గ్రౌండ్ అయినా, పార్లమెంట్ అయినా అంచనాలను నెరవేర్చి దేశం గర్వించేలా చేయడమేనని గంభీర్ బదులిచ్చారు.

Updated Date - 2020-10-07T07:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising