ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్విటోవా, జొకో జోరు

ABN, First Publish Date - 2020-10-04T09:22:44+05:30

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టాప్‌సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ జోరు కొనసాగిస్తున్నాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో జొకో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిట్సిపాస్‌ ముందంజ

సబలెంకా, జెలెనాకు షాక్‌ 

ఫ్రెంచ్‌ ఓపెన్‌


పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టాప్‌సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ జోరు కొనసాగిస్తున్నాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో జొకో 6-0, 6-3, 6-2తో డానియల్‌ గలన్‌ (కొలంబియా)ను చిత్తు చేసి ప్రీక్వార్టర్స్‌కు చేరాడు. మహిళల్లో ఏడో సీడ్‌ పెట్రా క్విటోవా, పురుషుల్లో ఐదోసీడ్‌ స్టెఫానొ సిట్సిపాస్‌ కూడా ముందంజ వేశారు. 

ప్రీక్వార్టర్స్‌లో క్విటోవా: మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో చెక్‌ రిపబ్లిక్‌ అందాల తార క్విటోవా 7-5, 6-3తో అనీ ఫెర్నాండెజ్‌ (కెనడా)ను ఓడించి ప్రీక్వార్టర్‌ఫైనల్‌లో ప్రవేశించింది. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) 6-2, 6-0తో ఇరీనా బారా (రుమేనియా)పై, ఆరో సీడ్‌ కికి బెర్టెన్స్‌ (హాలెండ్‌) 6-2, 6-2తో సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించారు. 

సబలెంకా, జెలెనా అవుట్‌: ఎనిమిదో సీడ్‌ అరీనా సబలెంకా (బెలారస్‌)కు ట్యునీసియా అమ్మాయి ఓన్స్‌ జెబ్యూర్‌ 7-6 (7), 2-6, 6-3తో షాకిచ్చింది. 2017 చాంపియన్‌ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) 4-6, 3-6తో పౌలా బడోసా (స్పెయిన్‌) చేతిలో ఓడింది.

సిట్సిపాస్‌కు వాకోవర్‌: పురుషుల ఐదోసీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీక్‌) 6-1, 6-2, 3-1తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి బెడెన్‌ (స్లొవేనియా) పాదం గాయంతో తప్పుకొన్నాడు. అలాగే దిమిత్రోవ్‌ 6-1, 6-3తో ముందంజలో ఉన్న తరుణంలో ప్రత్యర్థి బెనా (స్పెయిన్‌) వైదొలిగాడు.

Updated Date - 2020-10-04T09:22:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising