పాక్ మాజీ క్రికెటర్‌కు కరోనా!
ABN, First Publish Date - 2020-05-25T03:45:29+05:30
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి పాకిస్తాన్‌ను కూడా బెంబెలెత్తిస్తోంది.
ఇస్లామాబాద్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి పాకిస్తాన్‌ను కూడా బెంబెలెత్తిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ తఫీక్ ఉమర్‌కు కరోనా సోకినట్లు వెల్లడయింది. ఈ విషయాన్ని తఫీక్ ఉమర్ అంగీకరించారు. ‘ఒంట్లో కొంచెం నలతగా ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకున్నా. దానిలో పాజిటివ్ ఫలితం వచ్చింది. అయితే నా పరిస్థితి అంత సీరియస్‌గా లేదు’ అని తఫీక్ చెప్పాడు. అలాగే తాను ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు, తన ఆరోగ్యం కోసం భగవంతుణ్ణి ప్రార్థించాలని అభిమానులను కోరాడు. కాగా, పాక్ క్రికెట్ జట్టు తరఫున తఫీక్.. 44టెస్టులు, 22 వన్డేలు ఆడాడు.
Updated Date - 2020-05-25T03:45:29+05:30 IST