ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీ డిసైడయ్యాడా!

ABN, First Publish Date - 2020-03-31T10:11:51+05:30

భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ తిరిగి భారత జట్టులోకి ఎప్పుడు వస్తాడనేది అంతు పట్టకుండా ఉంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌ తర్వాత టీమిండియాకు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ తిరిగి భారత జట్టులోకి ఎప్పుడు వస్తాడనేది అంతు పట్టకుండా ఉంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌ తర్వాత టీమిండియాకు ఎంఎస్‌ దూరమయ్యాడు. కానీ ఐపీఎల్‌లో తన సత్తా ఏమిటో  నిరూపించుకుని టీ20 ప్రపంచక్‌పలోనూ ఆడతాడని చాలా మంది భావించారు. అయితే ఊహించని విధంగా ఆ లీగ్‌ జరగడం కష్టంగానే మారింది. దీంతో ఇప్పుడు అంతా అతడి భవితవ్యం గురించే ఆలోచిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అతడు తన రిటైర్మెంట్‌ ఆలోచనను కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పంచుకున్నాడని సమాచారం. అంతర్జాతీయ కెరీర్‌ ఇక ముగిసినట్టేనని, అయితే సీఎ్‌సకే తరఫున మరో రెండు సీజన్ల వరకు కొనసాగుతానని చెప్పాడట. 38 ఏళ్ల వయస్సులో జాతీయ జట్టుకు ఆడాల్సిన అవసరం లేదనే భావనలో ఈ మిస్టర్‌ కూల్‌ ఉన్నాడని, సమయమొచ్చినప్పుడు రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటిస్తాడని ఓ కథనం. మరోవైపు ఐపీఎల్‌లో తన ఫామ్‌ను అంచనా వేసుకున్నాకే ఏదో ఓ నిర్ణయం తీసుకుంటాడని, లేకపోతే ఎప్పుడో ఆట నుంచి వైదొలిగేవాడని సీఎ్‌సకే సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా స్పాన్సర్‌షిప్‌ కారణంగానే ధోనీ త్వరగా వీడ్కోలు నిర్ణయం ప్రకటించడం లేదని, ఇది అతడిని ఆర్థికంగా నష్టపరుస్తుందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.  

Updated Date - 2020-03-31T10:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising