ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్టాల్లో ఇంగ్లండ్‌

ABN, First Publish Date - 2020-08-07T09:48:10+05:30

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. పాక్‌ పేసర్లు అబ్బాస్‌, షహీన్‌షా అఫ్రీది దెబ్బకు కేవలం 92 పరుగులకే నాలుగు వికెట్లు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాపార్డర్‌ ఢమాల్‌

మసూద్‌ సెంచరీ

పాక్‌ 326 ఆలౌట్‌


మాంచెస్టర్‌: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. పాక్‌ పేసర్లు అబ్బాస్‌, షహీన్‌షా అఫ్రీది దెబ్బకు కేవలం 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి పోప్‌ (46), బట్లర్‌ (15) క్రీజులో ఉన్నారు. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంగ్లండ్‌ ఇంకా 234 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు ఓపెనర్‌ షాన్‌ మసూద్‌ (319 బంతుల్లో 156 పరుగులు) శతకంతో పాకిస్థాన్‌ పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 139/2తో రెండో రోజైన గురువారం ఆటను ఆరంభించిన పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 109.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. బాబర్‌ ఆజమ్‌ (69) నిన్నటి స్కోరువద్దే వెనుదిరిగాడు. మసూద్‌, షాదాబ్‌ ఖాన్‌ (45) జోడీ ఆరో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం సాధించింది. పేసర్లు బ్రాడ్‌ (3/54), ఆర్చర్‌ (3/59) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం పాక్‌ పేసర్లు షహీన్‌ షా అఫ్రీది (1/12), అబ్బాస్‌ (2/24) దెబ్బకు ఇంగ్లండ్‌ 12 పరుగులకే బర్న్స్‌ (4), సిబ్లే (8)తోపాటు స్టోక్స్‌ (0), కెప్టెన్‌ రూట్‌ (14) వికెట్లు కోల్పోయింది. 

మసూద్‌ వరుసగా: షాన్‌ మసూద్‌ టెస్ట్‌ల్లో వరుసగా మూడో సెంచరీ నమోదు చేశాడు. 1996లో సయీద్‌ అన్వర్‌ తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై టెస్ట్‌ల్లో శతకం బాదిన ఓపెనర్‌గా రికార్డుల కెక్కాడు. ఈ క్రమంలో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఏడో పాకిస్థాన్‌ ఆటగాడిగా నిలిచాడు.


Updated Date - 2020-08-07T09:48:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising