ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌ 139/2

ABN, First Publish Date - 2020-08-06T09:24:36+05:30

కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న పాకిస్థాన్‌.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో నిలకడగా ఆడుతోంది. మూడు టెస్ట్‌ల సిరీ్‌సలో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాణించిన బాబర్‌ 

ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌


మాంచెస్టర్‌: కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న పాకిస్థాన్‌.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో నిలకడగా ఆడుతోంది. మూడు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా బుధవారం ఆరంభమైన తొలి టెస్ట్‌లో పర్యాటక పాకిస్థాన్‌ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 139/2తో ఆడుతోంది. బాబర్‌ ఆజమ్‌ (69 బ్యాటింగ్‌) అర్ధ శతకంతోపాటు షాన్‌ మసూద్‌ (46 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. మసూద్‌, బాబర్‌ మూడో వికెట్‌కు అజేయంగా 96 పరుగులు జోడించారు. వర్షంతో పాటు వెలుతురు లేమితో తొలిరోజు 41 ఓవర్ల ఆట జరగలేదు. 

ఆదుకున్న బాబర్‌: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌కు ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్నే అందించారు. మసూద్‌, అబిద్‌ అలీ (16) ఆరంభంలో ఆచితూచి ఆడారు. అయితే, 16వ ఓవర్‌లో అబిద్‌ను బౌల్డ్‌ చేసిన ఆర్చర్‌ తొలి వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత చినుకులు పడడంతో కొంతసేపు మ్యాచ్‌కు అంతరాయం నెలకొంది. కాసేపటి ఆట మొదలైన తర్వాత కెప్టెన్‌ అజర్‌ అలీ (0)ని వోక్స్‌ వికెట్ల ముందు దొకరబుచ్చుకున్నాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఆజమ్‌.. ఓపెనర్‌ మసూద్‌తో కలసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడడంతో పాక్‌ 53/2తో లంచ్‌కు వెళ్లింది. రెండో సెషన్‌ మొత్తం పాక్‌ బ్యాట్స్‌మెన్‌దే పైచేయిగా నిలిచింది. మసూద్‌, బాబర్‌ ఇంగ్లండ్‌ బౌలర్లను పరీక్షిస్తూ స్కోరు బోర్డును నడిపించారు. 37వ ఓవర్‌లో పాక్‌ స్కోరు సెంచరీ దాటింది. ఆ తర్వాత బాబర్‌ అర్ధ శతకం పూర్తి చేశాడు. ఈ దశలో మళ్లీ వరుణుడు అంతరాయం కలిగించడంతో ముందుగానే ట్రీ బ్రేక్‌కు వెళ్లాల్సి  వచ్చింది. ఆ తర్వాత ఆట ఆలస్యంగా ఆరంభమైనా.. వెలుతురు లేమితో 8 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 

Updated Date - 2020-08-06T09:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising