ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై కిరణ్ మోరే సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-06-06T20:34:21+05:30

ఐసీసీ ప్రపంచకప్ 2019 తర్వాత క్రికెట్‌కి దూరమైన టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ మైదానంలో ఎప్పుడు అడుగుపెడతాడని.. అభిమానులు ఆసక్తిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసీసీ ప్రపంచకప్ 2019 తర్వాత క్రికెట్‌కి దూరమైన టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ మైదానంలో ఎప్పుడు అడుగుపెడతాడని.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియాన్ ప్రీమియర్ లీగ్‌ ద్వారా అతను మళ్లీ మైదానంలో మెరుస్తాడని అంతా భావించారు. కానీ, కరోనా వ్యాప్తి కారణంగా లీగ్ రద్దు కావడంతో అభిమానుల ఆశలు నీరుగారాయి. దీంతో ధోనీ రిటైర్‌మెంట్ మరోసారి తెరమీదకు వచ్చింది. ధోనీ క్రికెట్ కెరీర్ ఇక ముగిసినట్లే అని కొందరు క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ కిరణ్ మెరే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 


ధోనీ మళ్లీ క్రికెట్ ఆడటం అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు. ‘‘అది చాలా కష్టం.. కానీ, నిర్ణయం అతనిదే. మనస్సులో ఆడాలనే ఉంటుంది.. కానీ శరీరం సహకరించదు. అయితే ఐపీఎల్‌కి ముందు నేను అతన్ని నెట్స్‌లో చూశాను.. చాలా ఫిట్‌గా ఉన్నాడు. టెన్నీస్‌లో 34, 39 సంవత్సరాల ఆటగాళ్లు టాప్‌లో ఉన్నారు. ఇక్కడ కూడా క్రమశిక్షణతో ఉండి.. మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటే.. మళ్లీ క్రికెట్ ఆడొచ్చు. అశీశ్ నెహ్రా కూడా అలానే చేశాడు’’ అని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-06T20:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising