ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాహల్‌ను పెళ్లిచేసుకోబోయే ధనశ్రీ ఎవరో తెలుసా..?

ABN, First Publish Date - 2020-08-10T01:29:30+05:30

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రెండు రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. యూట్యూబర్ ధనశ్రీతో అతడి నిశ్చితార్థం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రెండు రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. యూట్యూబర్ ధనశ్రీతో అతడి నిశ్చితార్థం శనివారం జరిగింది. దీనికి సంబంధించిన తొలి ఫొటోను చాహల్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. దీనిపై సహచరులంతా అతడికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే చాహల్ వివాహం చేసుకోనున్న ధనశ్రీ ఎవరో అనేకమంది క్రికెట్ అభిమానులకు తెలియదు. దీంతో వారంతా ఆమె గురించి ఆన్‌లైన్‌లో వెదకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ధనశ్రీకి సంబంధించిన అనేక ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటపడ్డాయి. ధనశ్రీ ఓ డెంటిస్ట్. ఆమె డీవై పాటిల్ డెంటల్ కాలేజ్‌ నుంచి 2014లో డాక్టర్ పట్టా పొందారు. ధనశ్రీ స్వతహాగా ఓ డాన్సర్, కొరియోగ్రాఫర్.


ధనశ్రీ వర్మ డాన్స్ కంపెనీ పేరుతో ఓ సొంత డాన్స్ కంపెనీకి ఆమె యజమాని. ఈ క్వాలిటీలే కాకుండా ఆమెకు ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. ఆ చానల్‌కు 1.5 మిలియన్ల(15లక్షల) మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అంటే చాహల్ లానే ధనశ్రీ కూడా ఆల్ ఇన్‌వల్ అన్నమాట. ఇక వీరిద్దరూ కలిస్తే సోషల్ మీడియాలో ఇంకెంత దుమ్ము రేపుతారో వేచి చూడాలి.

Updated Date - 2020-08-10T01:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising