మారడోనా డిశ్చార్జ్
ABN, First Publish Date - 2020-11-13T09:40:36+05:30
మెదడులో రక్తస్రావం కారణంగా ఆస్పత్రి పాలైన సాకర్ దిగ్గజం డీగో మారడోనా ఎనిమిది రోజుల తర్వాత గురువారం డిశ్చార్జ్ అయ్యాడు
బ్యూన్‌సఎయిర్స్: మెదడులో రక్తస్రావం కారణంగా ఆస్పత్రి పాలైన సాకర్ దిగ్గజం డీగో మారడోనా ఎనిమిది రోజుల తర్వాత గురువారం డిశ్చార్జ్ అయ్యాడు. మారడోనా నీరసం, తలనొప్పితో గతవారం ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షల అనంతరం అతడి అస్వస్థతకు కారణం మెదడులో రక్తస్రావమని గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ సర్జరీ విజయవంతమైందని అతడి వ్యక్తిగత వైద్యుడు లియోపొల్డో లూకీ తెలిపాడు. ‘ప్రస్తుతం మారడోనా తీసుకుంటున్న మందులు పనిచేయాలంటే అతడు మద్యపానానికి కొంతకాలం దూరంగా ఉండాలి. ఈ మందులు వేసుకుంటూ మద్యం సేవిస్తే ప్రమాదం. ఈ విషయం మద్యపాన ప్రియుడైన అతడికి స్పష్టంగా చెప్పాం. మారడోనాను అతడి కుమార్తె దగ్గరుండి చూసుకుంటున్నార’ని లూకీ తెలిపాడు.
Updated Date - 2020-11-13T09:40:36+05:30 IST