ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

55 బంతుల్లో 158

ABN, First Publish Date - 2020-03-07T10:34:16+05:30

వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. డీవై పాటిల్‌ టీ20 కప్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హార్దిక్‌ పాండ్యా విశ్వరూపం

నవీ ముంబై: వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. డీవై పాటిల్‌ టీ20 కప్‌లో రిలయన్స్‌-1 జట్టు తరఫున ఆడుతున్న పాండ్యా ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ అంతర్జాతీయ క్రికెట్‌కు సై అంటున్నాడు. మంగళవారం 39 బంతుల్లో 105 పరుగులు బాదిన అతడు శుక్రవారం జరిగిన సెమీ్‌సలో మరింత ఊచకోతకు దిగాడు. బీపీసీఎల్‌తో జరిగిన సెమీ్‌సలో కేవలం 55 బంతుల్లోనే అజేయంగా 158 పరుగులతో దుమ్మురేపాడు. ఇందులో 20 సిక్సర్లు, 6 ఫోర్లున్నాయి. వీటి ద్వారానే 144 పరుగులు వచ్చాయంటే అతడి సునామీ ఆటతీరు ఎలా సాగిందో తెలుస్తుంది. పాండ్యా ధాటికి రిలయన్స్‌-1 జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 238 పరుగులు చేసింది. అయితే ఇదే జట్టు ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ మాత్రం 3 పరుగులకే అవుటయ్యాడు. ఆతర్వాత బీపీసీఎల్‌ 134 పరుగులకు ఆలౌటైంది. 

Updated Date - 2020-03-07T10:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising