ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 163

ABN, First Publish Date - 2020-09-30T03:17:36+05:30

షేక్ జాయేద్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: షేక్ జాయేద్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ 2020 11వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ జట్టుకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టో శుభారంభాన్ని అందించారు. 77 పరుగుల వద్ద సన్‌రైజర్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. మిశ్రా బౌలింగ్‌లో పంత్‌కు కీపర్ క్యాచ్‌గా చిక్కి వార్నర్(45) వెనుదిరిగాడు.


ఆ తర్వాత క్రీజులోకొచ్చిన మనీష్ పాండే 3 పరుగులకే రబడ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. అనంతరం.. క్రీజులోకొచ్చిన విలియమ్‌సన్, బెయిర్‌స్టోతో కలిసి నిలకడగా ఆడాడు. విలియమ్‌సన్ 26 బంతుల్లో 41 పరుగులు చేశాడు. బెయిర్‌స్టో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీ చేసుకుని దూకుడుగా ఆడుతుండగా.. రబడ బౌలింగ్‌లో క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో రబడకు రెండు, మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి.

Updated Date - 2020-09-30T03:17:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising