ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మైండ్‌బ్లాక్’ పాటకి వెరైటీగా టిక్‌-టాక్ చేసిన డేవిడ్ వార్నర్

ABN, First Publish Date - 2020-05-25T19:49:54+05:30

డేవిడ్ వార్నర్.. తెలుగు హీరోల పాటలకు స్టెప్పులతో అదరగొడుతున్నాడు. రీసెంట్‌గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘పక్కా లోకల్’ సాంగ్‌ చేసి బర్త్ డే విషెస్ తెలియజేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డేవిడ్ వార్నర్.. టిక్-టాక్‌లో తెలుగు హీరోల పాటలకు స్టెప్పులతో అదరగొడుతున్నాడు. రీసెంట్‌గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘పక్కా లోకల్’ సాంగ్‌ చేసి బర్త్ డే విషెస్ తెలియజేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రాములో రాములా, బుట్టబొమ్మ అంటూ ఫ్యామిలీతో కలిసి డాన్సులు చేశాడు డేవిడ్. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక్కసారి కమిటైతే ‘నా మాట నేనే వినను’ అనే డైలాగ్ చెప్పిన వార్నర్.. బాహుబలి సినిమాలో ‘అమరేంద్ర బాహుబలి అనే నేను’ డైలాగ్ చెప్పి అలరించాడు. 


అయితే ఈ క్రమంలో డేవిడ్ వార్నర్‌ని అభిమానులు అందరూ ఒకటి బలంగా కోరారు. మహేశ్ బాబు రీసెంట్ హిట్ సరిలేరు నీకెవ్వరులోని ‘మైండ్‌బ్లాక్’ పాటకి టిక్‌-టాక్ చేయాల్సిందిగా ఫ్యాన్ వార్నర్‌ని అడిగారు. అయితే ఆస్ట్రేలియాలో ఆ పాట అందుబాటులో లేదని.. అందుబాటులోకి వచ్చిన వెంటనే దానిపై వీడియో చేస్తానని వార్నర్ తెలిపాడు. మొత్తానికి ఆ పాట ఆస్ట్రేలియాలో అందుబాటులోకి రావడంతో వార్నర్ దానిపై టిక్‌-టాక్ చేశాడు. 


అయితే డ్యాన్స్‌ రూపంలో కాకుండా.. వార్నర్ వెరైటీగా ఈ వీడియో చేశాడు. బ్యాట్ పట్టుకొని క్రమంగా మాయం అవుతున్నట్లు చేశాడు వార్నర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. 



Updated Date - 2020-05-25T19:49:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising