ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేంజర్‌.. దేవదత్‌

ABN, First Publish Date - 2020-09-22T09:44:19+05:30

ఆర్‌సీబీ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కళ్‌ బ్యాటింగ్‌ తీరు చూస్తే అతనాడుతోంది తొలి మ్యాచ్‌ అంటే ఎవరూ నమ్మరేమో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్‌:ఆర్‌సీబీ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కళ్‌ బ్యాటింగ్‌ తీరు చూస్తే అతనాడుతోంది తొలి మ్యాచ్‌ అంటే ఎవరూ నమ్మరేమో.. నిజానికి దేవదత్‌ పుట్టకముందే తనకు కొడుకు పుడితే కచ్చితంగా క్రికెటర్‌ను చేస్తానని అతడి తల్లి అనుకుందట.. ఆమె ఆకాంక్షకు అనుగుణంగానే అతను క్రికెటరయ్యాడు. దాదాపు 6 అడుగుల ఈ కర్ణాటక యువ స్టార్‌.. క్రీజులో ఉన్నంత సేపు తన స్ట్రోక్‌ ప్లేతో రైజర్స్‌ బౌలర్లను చెడుగుడు ఆడేశాడు.


రెండో ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాదిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ ఆ తర్వాత నటరాజన్‌ ఓవర్లో మూడు ఫోర్లతో చెలరేగాడు. ఆఫ్‌ సైడ్‌.. ఆన్‌ సైడ్‌ షాట్లతో పాటు చక్కటి డ్రైవ్స్‌తో బౌండరీల వరద పారించాడు. మరో ఎండ్‌లో విధ్వంసకర ఆటగాడు ఫించ్‌ ఉన్నప్పటికీ అతడిని నామమాత్రం చేస్తూ తనే బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలో అతను 36 బంతుల్లోనే అర్ధసెంచరీని పూర్తి చేస్తూ.. భారత్‌ భవిష్యత్‌ తార అనిపించుకున్నాడు. 

Updated Date - 2020-09-22T09:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising